Sakshi News home page

రూ.250 కోట్లపైనే..

Published Thu, Feb 8 2024 4:28 AM

Former HMDA Sivabalakrishna has assets of Rs 250 crores - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హెచ్‌ఎండీఏ మాజీ ప్లానింగ్‌ డైరెక్టర్‌ శివబాలకృష్ణ ఆస్తులు రూ. 250 కోట్లపైనే ఉంటాయని ఏసీబీ అధికారులు ఓ అంచనాకు వచ్చారు. శివబాలకృష్ణ కస్టడీ బుధవారంతో ముగి సింది. ఆయన ఇంట్లో కొద్ది రోజులుగా జరుపుతున్న సోదాలు ముగిసినట్టు ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌ సుదీంద్ర వెల్లడించారు. శివబాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్టు గుర్తించామని, ఆయన సమీప బంధువులు, స్నేహితులు, సహ ఉద్యోగుల ఇళ్లలో మొత్తంగా 17 ప్రదేశాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారని చెప్పారు.  

ఇవీ ఆస్తులు... 
శివబాలకృష్ణ ఇంట్లో రూ. 84.60 లక్షల నగదు, 2 కేజీలు బంగారం, 5.5 కేజీల వెండి, 32 లక్షలు విలు వ చేసే వాచ్‌లు, 3 విల్లాలు, 7 ఫ్లాట్స్‌తోపాటు కొడ కండ్ల, జనగామ, నాగర్‌కర్నూలు, సిద్ధిపేట, యా దాద్రి, పాలకుర్తి, జఫర్‌గఢ్‌ ప్రాంతాల్లో 214 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించామని సు«దీంద్ర చెప్పారు. భూమి ఆయన పేరుతోపాటు కొందరు బినామీల పేరుపై ఉందని, 29 ఓపెన్‌ప్లాట్లు ఉన్నాయని, రంగారెడ్డిజిల్లాలోనే 12, వైజాగ్, విజయవా డ, సంగారెడ్డి ప్రాంతాల్లో కూడా ఖాళీ స్థలాలు రిజి స్టర్‌ అయ్యాయన్నారు.

అన్నింటి విలువ రూ.250 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు తెలిపా రు. సోదాలు ఇంకో నాలుగు చోట్ల కొనసాగుతున్నాయని, శివబాలకృష్ణ పై కేసు నమోదు చేసి, గురువారం న్యాయస్థా నం ముందు హాజరుపరుస్తామన్నారు. ‘ఇంకా కొన్ని విషయాలు ఆయ న చెప్పలేదు..మా విచారణకు సహకరించలేదు. కస్టడీకి తీసుకుంటే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది.’అని సు«దీంద్ర తెలిపారు. 

మిగతా అధికారుల్లో టెన్షన్‌.. 
హెచ్‌ఎండీఏలో పనిచేస్తున్న మిగతా అధికారుల్లో టెన్షన్‌ నెలకొంది. హెచ్‌ఎండీఏ పరిధి ఏడు జిల్లాల్లో విస్తరించి ఉండగా, గతంలో అనుమతులు మంజూరు చేసిన లేఔట్లు, ప్లాట్లకు సంబంధించిన ఫైల్స్‌ అన్నింటినీ పరిశీలించే యోచనలో ఏసీబీ ఉంది. హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో నిర్మిస్తున్న హైరేజ్‌ అపార్ట్‌మెంట్లకు అనుమతుల్లో హెచ్‌ఎండీఏ అధికారులు భారీగా లంచాలు పొందినట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు.

ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడానికి రెండు రోజుల ముందు భారీఎత్తున లాండ్‌ కన్జర్వేషన్‌ జరిగిందని, హైరైస్‌ బిల్డింగ్‌ జోన్‌ పరిధిలోకి భూముల మార్పు జరిగిందని భావిస్తున్నారు. ఉస్మాన్‌సాగర్‌ పరిధిలోనూ భారీగా భూమారి్పడి జరిగిందని సమాచారం. ఆ రెండు రోజుల్లోనే రూ.200 కోట్ల విలువైన భూములు చేతులు మారినట్టు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది.

పూర్తిస్థాయి విచారణ జరిగితే ఇందులోని పెద్ద తలకాయల భాగోతాలు బట్టబయలు అవుతాయని తెలుస్తోంది. కాగా ఉప్పల్‌లో శివబాలకృష్ణ సోదరి ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. శివబాలకృష్ణ సోదరి, ఇద్దరు కొడుకులు హెచ్‌ఎండీఏలో ఆయన దగ్గరే పనిచేశారు. వీరంతా బినామీలుగా ఉన్నట్టు గుర్తించారు.  

హెచ్‌ఎండీఏలో మూడో రోజు ఏసీబీ సోదాలు 
హెచ్‌ఎండీఏలో మూడో రోజు ఏసీబీ సోదాలు కొనసాగాయి. శివబాలకృష్ణపై విచారణలో భా గంగా పలు కీలకమైన ఫైళ్లు ఏసీబీ అధికారులు స్వా«దీనం చేసుకున్నట్టు తెలిసింది. బుధవారం ఉదయమే అమీర్‌పేట్‌లోని హెచ్‌ఎండీఏ కా ర్యాలయానికి చేరుకున్న ఏసీబీ అధికారులు రాత్రి వరకు సోదాలు నిర్వహించారు. శివబాల కృష్ణ హయాంలో ఇ చ్చి న అనుమతులపైన ప్ర ధానంగా దృష్టి సారించి మూడురోజుల పాటు ఫైళ్లను పరిశీలించినట్టు తెలిసింది.

ముఖ్యంగా కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ, తదితర ప్రాంతాల్లో నిర్మించిన భారీ బహుళ అంతస్తుల భవనాలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇ చ్చి నట్టు ఏసీబీ అధికారుల పరిశీలనలో వెల్లడి కావడంతో, ఆ దిశగానే హెచ్‌ఎండీఏలో సోదాలు నిర్వహించారు. శివబాలకృష్ణ రెరాకు బదిలీ అయిన తర్వాత కూడా పలు ఫైళ్ల కు పాత తేదీలపైన అనుమతులు ఇవ్వడాన్ని ఏసీబీ సీరియస్‌గా పరిగణిస్తోంది.  

Advertisement

What’s your opinion

Advertisement