అరడజనకుపైగా వీధికుక్కల దాడి.. తీవ్రగాయాలపాలై ఐదేళ్ల చిన్నారి మృతి..

Five Years Old Girl Died Street Dogs Attack Madhya Pradesh - Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్ ఖర్‌గోన్‌లో ఘోరం జరిగింది. వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. బకావా గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. చిన్నారి కిరాణ దుకాణానికి వెళ్లే సమయంలో వీధిలోని అరడజనుకు పైగా శునకాలు ఆమెపై దాడి చేశాయి. మెడ, శరీరంలోని ఇతర భాగాలపై తీవ్రగాయాలు చేశాయి. దీంతో బాలికకు తీవ్ర రక్తస్రావమైంది.

పాప అరుపులు కేకలు విని స్థానికులు వచ్చి కుక్కలను చెదరగొట్టారు. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ చిన్నారి సోనియా ప్రాణాలు కోల్పోయింది. ఆమె తండ్రి రోజూకూలీగా పనిచేస్తున్నాడు. తాను పని మీద బయటకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగిందని రోదించాడు.
చదవండి: స్నేహితుడిని బెదిరించి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌పై గ్యాంగ్‌ రేప్‌

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top