స్నేహితుడిని బెదిరించి.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌పై 10 మంది గ్యాంగ్‌ రేప్‌

Software Engineer Gang Raped By 10 people In Jharkhand Chaibasa - Sakshi

రాంచి: దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా మానవ మృగాల చేతిలో అమాయకులు బలిపోతున్నారు. స్నేహితుడితో వెళ్లిన ఓ 26 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌పై దాడి చేసి 10 మంది గుర్తుతెలియని దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఝార్ఖండ్‌లోని ఛాయ్‌బాసా ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది. బాధితురాలు ట్రైబల్‌ కమ్యూనిటీకి చెందినదిగా పోలీసులు తెలిపారు. ఆమెను సదర్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  

బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశారు పోలీసులు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం ఈ దారుణం అక్టోబర్‌ 20న జరిగింది. తన స్నేహితుడితో కలిసి సాయంత్రం 6 గంటలకు టెక్రాహటు ఎయిర్‌స్ట్రిప్‌కు బైక్‌పై వెళ్లింది. రోడ్డు పక్కన నిలబడి స్నేహితుడితో మాట్లాడుతోంది. అప్పుడే వారి వద్దకు 8-10 మంది దుండగులు వచ్చి దాడి చేశారు. ఆమెతో ఉన్న వ్యక్తిని బెదిరించి యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని.. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఏర్పాటు చేశారు పోలీసులు. ఆసుపత్రి వద్ద భారీగా భద్రత ఏర్పాటు చేశారు. ఛాయ్‌బాసా ముఫాసిల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని టెక్రాహటూ ప్రాంతంలో ఈ దారుణం జరిగినట్లు చెప్పారు. సమాచారం అందుకున్న సబద్‌ సబ్‌ డివిజనల్‌ పోలీస్‌ అధికారి దిలీప్‌ ఖల్కో, ముఫాసిల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ పవన్‌ పతాక్‌లు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉండే కొంత మంది యువతను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు.

ఇదీ చదవండి: వీడియో: భారీగా ఊగిపోయిన విమానం.. ప్రయాణికుల ముక్కులు, మూతులు పగిలాయ్‌!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top