బాసర ట్రిపుల్‌ ఐటీలో ర్యాగింగ్‌!  | Five Students Booked For Ragging Case At IIIT Basar In Telangana | Sakshi
Sakshi News home page

బాసర ట్రిపుల్‌ ఐటీలో ర్యాగింగ్‌! 

Nov 18 2022 12:32 AM | Updated on Nov 18 2022 12:32 AM

Five Students Booked For Ragging Case At IIIT Basar In Telangana - Sakshi

పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధిత విద్యార్థులు 

బాసర(ముధోల్‌): బాసర ట్రిపుల్‌ ఐటీలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను సీనియర్‌ విద్యార్థులు ర్యాగింగ్‌ చేయడంతో పోలీసులు ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. బాసర ట్రిపుల్‌ ఐటీలోని స్థానిక కృష్ణా బాయిస్‌ హాస్టల్‌ రూం నంబర్‌ 228ను పీయూసీ–1 విద్యార్థులకు అధికారులు కేటాయించారు. అయితే ఆ గదిలోని నూతన వస్తువులైన బెడ్‌ కార్టులు, ట్యూబ్‌ లైట్లను పీయూసీ–2 విద్యార్థులు జూనియర్లను బెదిరించి తీసుకెళ్లారు.

ఇటీవల డైరెక్టర్‌ సతీశ్‌కుమార్‌ హాస్టల్‌ భవనాలు తనిఖీ చేసిన సందర్భంలో ఈ విషయాన్ని జూనియర్లు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో అప్పటి నుంచి కక్ష సాధింపు చర్యగా సీనియర్లు ర్యాగింగ్‌ చేయడం మొదలుపెట్టారు. రోజు రోజుకూ సీనియర్ల ర్యాగింగ్‌ శృతిమించడంతో బాధిత విద్యార్థులు పోలీసులను ఆశ్రయించారు. కళాశాల వార్డెన్‌ ఫిర్యాదు మేరకు తెలంగాణ ప్రొహిబిషన్‌ యాక్ట్‌ సెక్షన్‌ 323, 506, రాగింగ్‌ సెక్షన్‌ 4(1/2/3) ప్రకారం ఐదుగురు విద్యార్థులపై కేసులు నమోదు చేసినట్టు ఎస్సై మహేశ్‌ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement