చెన్నైలో భారీ అగ్ని ప్రమాదం | Fire Accident In Chennai Koyambedu Bus Stand | Sakshi
Sakshi News home page

చెన్నైలో భారీ అగ్ని ప్రమాదం

Aug 23 2020 2:21 PM | Updated on Aug 23 2020 2:53 PM

Fire Accident In Chennai Koyambedu bus stand - Sakshi

సాక్షి, చెన్నై : చెన్నైలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోయంబేడు ప్రైవేట్‌ బస్సులు నిలిపే ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ ఉన్న బస్సులకు మంటలు అంటుకున్నాయి. బస్సులన్నీ పక్కపక్కనే ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఇప్పటి వరకు మూడు బస్సులు పూర్తిగా దగ్ధం అయినట్లు తెలుస్తోంది. కాగా సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సిఉంది.

Advertisement
 
Advertisement
Advertisement