ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం | Few People Died In Road Accident After Car Hits Lorry | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

Mar 31 2025 6:09 PM | Updated on Mar 31 2025 6:52 PM

Few People Died In Road Accident After Car Hits Lorry

కృష్ణాజిల్లా:  జిల్లాలోని అవనిగడ్డ మండలం పులిగడ్డ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పులిగడ్డ‍ పెనుమూడి వారధి సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల్లో ఒక పసికుందు కూడా ఉంది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

మృతుల్లో ఒకరు తెనాలికి చెందిన జిడుగు రామ్మోహన్ గా పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన మిగతా ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం మచిలీపట్నం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement