ఆన్‌లైన్‌ గేమ్‌లు వద్దన్నా.. వినకపోవడంతో కొడుకును చంపేసిన తండ్రి | father killed his own son in karimnagar district | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ గేమ్‌లు వద్దన్నా.. వినకపోవడంతో కొడుకును చంపేసిన తండ్రి

Published Sat, Apr 27 2024 5:28 AM | Last Updated on Sat, Apr 27 2024 5:28 AM

father killed his own son in karimnagar district

నిద్రిస్తున్న కొడుకు తలపై రోకలి బండతో మోది.. కారం చల్లి 

కరీంనగర్‌ జిల్లా చింతకుంటలో దారుణం

కొత్తపల్లి(కరీంనగర్‌): ఆన్‌లైన్‌ గేమ్‌లు వద్దన్నా విననందుకు.. కన్న కొడుకునే తండ్రి కడతేర్చిన దారుణ ఘటన శుక్రవారం కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో చోటుచేసుకుంది. చేతికొచి్చన ఒక్కగానొక్క కొడుకును తండ్రే పొట్టన పెట్టుకోవడంపై గ్రామస్తులు విస్మయానికి లోనయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. చింతకుంటకు చెందిన పెరుమాండ్ల జ్యోతి–శ్రీనివాస్‌కు కొడుకు, కూతురు ఉన్నారు. కూతురుకు పెళ్లి కాగా, కొడుకు పెరుమాండ్ల శివసాయి(21) హైదరాబాద్‌లో ఉంటూ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఇంట్లో శుభకార్యం కోసం బుధవారం స్వగ్రామానికి వచ్చాడు. 

కాగా, హైదరాబాద్‌ వెళ్లి ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడి డబ్బులు పోగొట్టొద్దని, ఇక్కడే ఉండాలంటూ తరచూ తండ్రీకొడుకుల మధ్య వాదనలు చోటు చేసుకుంటున్నాయి. ఈక్రమంలో భూమి అమ్మాలని శివసాయి ఒత్తిడి తెస్తుండటంతో ఆగ్రహానికి గురైన తండ్రి శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిద్రిస్తున్న కొడుకు తలపై రోకలి బండతో మోది కారం చల్లాడు. తీవ్రగాయాలతో శివసాయి మంచంపైనే మృతిచెందగా తండ్రి కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. మృతుడి తల్లి ఉపాధి పనులకు వెళ్లగా ఈ దారుణం జరిగింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement