Retired Navy Officer Killed By Son Over Exam Fee Argument In Bengal, Details Inside - Sakshi
Sakshi News home page

Bengal: శ్రద్ధ తరహాలోనే..! తండ్రిని చంపి ముక్కలుగా.. సాయం చేసిన తల్లి

Nov 21 2022 7:36 PM | Updated on Nov 21 2022 9:40 PM

Examination Fees Argument Retired Navy Officer Killed By Son In Bengal - Sakshi

ఎగ్జామినేషన్‌ ఫీజు చెల్లింపు వాగ్వాదం హత్యకు దారితీసింది. కన్నకోడుకుని జైలు పాలయ్యేలా చేసింది

దేశాన్నే ఉలిక్కిపడేలా చేసిన శ్రద్ధా హత్య కేసు మరువక మునుపే అచ్చం అలాంటి ఉదంతమే పశ్చిమ బెంగాల్‌ చోటు చేసుకుంది. కాకపోతే అక్కడ నిందితుడు ప్రియురాలిని 35 ముక్కలుగా చేస్తే....ఇక్కడొక ఒక కొడుకు కన్న తండ్రేని హతమార్చి ఆరు ముక్కలుగా కోసేశాడు. 

వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....కోల్‌కతలాని బరుయ్‌పూర్ ఉంటున్న రిటైర్డ్‌ నేవీ ఆఫీసర్‌ 55 ఏళ్ల చక్రవర్తి కన్న కొడుకు చేతిలో హతమయ్యాడు. అతను 2000లో రిటైర్ అయ్యారు. ఒక ఎగ్జామ్‌ ఫీజు విషయమై తలెత్తిన వివాదం హత్య చేసేందుకు దారితీసింది. ఆ అధికారి కుటుంబ సభ్యల మధ్య ఎగ్జామ్‌ ఫీజు చెల్లింపు విషయమై వాగ్వాదం తలెత్తింది. దీంతో ఆగ్రహించిన కొడుకు కోపంతో తండ్రి గొంతుకోసి చంపేశాడు. ఆ తర్వాత అతన్ని ఆరు ముక్కలుగా కోసి తమ ఇంటికి సమీపంలో వేరు వేరు చోట్ల పడేశాడని చెప్పారు.

అందుకు అతడి తల్లి సహకరించింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఏమి ఎరుగనట్లుగా పోలీసులకు నవంబర్‌ 15న మిస్సింగ్‌ కేసుగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న తాము ఆ తల్లి కొడుకులను గట్టిగా విచారించగా...అసలు విషయం తెలుసుకుని ఒక్కసారిగా షాక్‌ అయ్యామని పోలీసులు చెబుతున్నారు. తామే హత్య చేసి ముక్కలుగా కోసి పడేసినట్లు తల్లి కొడుకులు ఒప్పుకున్నారు.

పరీక్ష ఫీజు చెల్లించే విషయమై తీవ్ర వాగ్వాదానికి దిగాడని..తట్టుకోలేక ఈ దారుణానికి నిందితుడు ఒడిగట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. విచారణలో నిందితుడు ఆ భాగాలను ప్లాస్టిక్‌ కవర్‌తో చుట్టి సైకిల్‌పై తీసుకువెళ్లి పడేసినట్లు తెలిపాడు. బాధితుడి శరీర భాగాలను చెరువు సమీపంలో చెత్త డంప్‌ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసలు తెలిపారు. మృతదేహాన్ని కోయడానికి ఉపయోగించిన కత్తి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఐతే విచారణలో బాధితుడు తరచు తాగొచ్చి కుటుంబ సభ్యులతో  గొడవపడుతూ ఉండేవాడని స్థానికులు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఆ తల్లి కొడుకులిద్దర్నీ అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ పుష్ప తెలిపారు.

(చదవండి: చెప్పకుండా పెళ్లి చేసుకుందని...కన్న తండ్రే కాలయముడిలా...)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement