బ‌య‌ట‌ప‌డుతున్న కీస‌ర ఎమ్మార్వో అక్ర‌మాలు

Emaruo Nagrajs Corruption Activities In The ACB Trial Are Coming Out  - Sakshi

సాక్షి, మేడ్చ‌ల్ :  ఏసీబీ విచారణలో కీస‌ర‌ ఎమ్మార్వో నాగరాజు అక్రమాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. పహనీలు రాకుండా, డిజిటల్ సంతకాలు కన్పించకుండా తనవద్ద‌కే  బాధితులు నేరుగా వచ్చేలా ఎమ్మార్వో స్కెచ్ వేసిన‌ట్లు తెలుస్తోంది. 30శాతం భూములు బ్లాక్ చేసి భూ యజమానులను వేధింపుల‌కు గురి చేసిన‌ట్లు అధికారులు తెలిపారు. ఎమ్మార్వో నాగ‌రాజు..విదేశాల్ల ఉన్న వ్యక్తుల పేర్ల‌మీద  భారీగా ఆస్తుల కొనుగోలు చేసి వీటిని న‌గ‌రంలోని మార్వాడి సేట్‌ల‌కు వ‌డ్డీ వ్యాపారాల‌కు ఇచ్చిన‌ట్లు స‌మాచారం. వీరికి సంబంధించిన బ్యాంకు లాక‌ర్ల తాళాల‌ను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అన్ని కోణాల్లో ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేశారు. ఈ అవినీతి తిమింగ‌లం అక్ర‌మాలు, ఈ కుట్ర కోణం వెన‌కున్న బ‌డానేత‌ల వివ‌రాల‌ను కూడా బ‌య‌ట‌పెడ‌తామ‌ని తెలిపారు. రియల్టర్‌ అంజిరెడ్డి వద్ద ఏసీబీ సోదాల్లో రేవంత్‌రెడ్డి ఎంపీ లాడ్స్ నిధుల ఫైళ్లు లభ్యమైనట్టు సమాచారం. ఏసీబీకి చిక్కిన రియల్టర్ బ్రోకర్ అంజిరెడ్డి, రేవంత్‌కు సన్నిహిత సంబంధాలున్నట్టు దీని ద్వారా తెలుస్తోంది. రేవంత్‌ వద్ద ఉండాల్సిన కీలక పత్రాలు రియల్టర్ వద్ద ఉండటంపై విచారణ చేస్తున్నామని ఏసీబీ తెలిపారు. నాలుగురోజుల పాటు క‌స్ట‌డీకి అనుమతించాల్సిందిగా ఏసీబీ అధికారులు పిటిష‌న్ దాఖ‌లు చేశారు. నేడు విచార‌ణ‌కు సంబంధించి క‌స్ట‌డీ ఇచ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. (కీసర ఎమ్మార్వో నాగరాజు కేసులో కొత్త కోణం!)

ప‌లు కీల‌క డాక్యుమెంట్లు స్వాధీనం
నిందితులు నాగ‌రాజు, అంజిరెడ్డి నివాసాలు, కార్యాల‌యాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వ‌హించగా ప‌లు  ప‌లు కీల‌క డాక్యుమెంట్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. డాక్యుమెంట్ల ఆధారంగా నిందితులకు సహకరించిన వారి వివ‌రాల‌ను ఏసీబీ అధికారులు సేక‌రిస్తున్నారు. అయితే ఈ క్ర‌మంలో ఎమ్మార్వో నాగ‌రాజు ఇంట్లో నుంచి కొన్ని డాక్యుమెంట్లను మాయం చేసిన‌ట్లు అధికారులు గుర్తించారు. మొద‌టినుంచి ఈ కేసులో రాజ‌కీయ‌నేత‌ల హ‌స్తం ఉంద‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఎమ్మార్వో ఇంటికి బెంజ్, ఇన్నోవా కార్లరో  వచ్చిన వ్యక్తుల కోసం  పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీటీవీ విజువ‌ల్స్ ఆధారంగా విచ‌ర‌ణ చేప‌డుతున్నారు. (కీసర భూదందాలో రాజకీయ హస్తం!)

 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top