కట్నం ఇవ్వలేదని శోభనం అడ్డుకున్న కుటుంబ సభ్యులు

Dowry Harassment In Karnataka - Sakshi

కర్ణాటక: కట్నం ఇవ్వలేదని శోభనం జరగకుండా అడ్డుకున్న ఆమె భర్త, అతని కుటుంబ సభ్యులపై వివాహిత బసవనగుడి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాలు...బాధిత మహిళకు 2022 జూన్‌ 6న అవినాశ్‌ శర్మతో వివాహం జరిగింది. వివాహ సమయంలో వరుడు కుటుంబ సభ్యులు కట్నం వద్దన్నారు.

వివాహమై భర్త ఇంట్లోకి అడుగుపెట్టిన రోజు వరుడి తండ్రి మీ కుటుంబ సభ్యులు తనకు రూ.15 లక్షలు ఇస్తామని తెలిపారని, ఆ డబ్బు ఇవ్వకపోతే మొదటిరాత్రి శోభనానికి అనుమతించేదిలేదని కోడలిని బెదిరించాడు. ఈ విషయం కోడలు తల్లిదండ్రులకు తెలపడంతో డబ్బు ఇవ్వడానికి తల్లిదండ్రులు కొద్దిరోజులు సమయం ఇవ్వాలని కోరారు. 2022 జూన్‌ 22 తేదీన బాధిత మహిళ తల్లిదండ్రులు రూ.5.8 లక్షలు నగదు ఇచ్చారని మహిళ ఫిర్యాదులో పేర్కొంది.

స్నానం చేస్తుండగా గమనించేవారు
ఇంతటితో మిన్నకుండిన భర్త కుటుంబ సభ్యులు మిగిలిన రూ.10 లక్షలు ఇవ్వకుంటే ఇంట్లో ఉండనిచ్చేదిలేదని కోడల్ని బెదిరించారు. స్నానం చేస్తుండగా భర్త తండ్రి చాటుగా గమనించేవాడు. దీనిపై కోడలు మామను ప్రశ్నించగా ఎవరికై నా చెబితే నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తామని బెదిరించారని మహిళా ఫిర్యాదులో ఆరోపించింది. బాధిత మహిళ మళ్లీ పుట్టింటికి వెళ్లి తమ గోడు వెళ్లబోసుకుంది. 

తల్లిదండ్రులు అల్లుడి ఇంటి వద్దకు విచారించగా మేము చెప్పినట్లు వినాలని లేకపోతే ఇప్పుడే రూ.15 లక్షల డబ్బు ఇవ్వాలని తెలిపారు. అనంతరం మహిళ కుటుంబసభ్యులు అక్కడ నుంచి తమ ఇంటికి వెళ్లిపోయారు. నాకు సంబంధించిన పత్రాలు అత్తగారింట్లో ఉన్నాయని వీటి గురించి అడిగితే డబ్బు ఇచ్చి మీ పత్రాలు తీసుకెళ్లాలని తెలిపారని ఫిర్యాదులో బాధితురాలు తెలిపింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top