సింగర్‌ సునీత ఫిర్యాదు.. చైతన్య అరెస్ట్‌ | Cyber Crime Arrested Chaitnya From Anantapur On Complaint By Singer Sunitha | Sakshi
Sakshi News home page

సింగర్‌ సునీత ఫిర్యాదు.. చైతన్య అరెస్ట్‌

Aug 8 2020 12:40 PM | Updated on Aug 8 2020 5:11 PM

Cyber Crime Arrested Chaitnya From Anantapur On Complaint By Singer Sunitha - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సోషల్‌ మీడియా వేదికగా తన పేరును వాడుకుని అమాయక ప్రజల్ని మోసం చేస్తున్న ఓ వ్యక్తిపై గాయని సునీత సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పోలీసులు అనంతపురానికి చెందిన చైతన్య అనే వ్యక్తిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. చైతన్య అనే వ్యక్తి సింగర్‌ సునీత మేనళ్లుడినంటూ చెప్పుకుంటూ సోషల్‌ మీడియా వేదికగా డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు. సునీత పేరుతో తాను స్వచ్ఛందంగా సేవ చేస్తున్నట్లు ప్రచారం చేసుకున్నాడు. దీంతో సునీత పేరు చూసి ఆమె అభిమానులు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారు. కాగా గతవారం సునీత ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతూ.. చైతన్య అనే అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదని.. అభిమానులెవరు వాడి వలలో పడొద్దని హెచ్చరించారు. తాజాగా సునీత ఫిర్యాదుతో  చైతన్యను సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.(ఫేక్‌ సింగర్‌పై గాయని సునీత సీరియస్)

Advertisement
 
Advertisement
Advertisement