కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అల్లుడి కాల్చివేత

Congress MLA nephew shot dead in Bihar home - Sakshi

పట్నా: బిహార్‌ రాష్ట్ర  కాంగ్రెస్ ఎమ్మెల్యే సంతోష్ కుమార్ మిశ్రా మేనల్లుడిపై నలుగురు గుర్తు తెలియని దుండగులు శనివారం కాల్పులు జరిపి హతమర్చారు. ఈ  ఘటన రోహ్తాస్ జిల్లా పార్సతువా మార్కెట్‌ సమీపలోని సోహాసా ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. సంజీవ్‌ కుమార్‌ మిశ్రా(40) మెడిసిన్‌ కోసం సమీపంలోని మెడికల్‌షాప్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా నలుగురు దుండగులు రెండు బైకుల మీది వచ్చి అతనిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనతో ఒక్కసారిగా మార్కెట్‌ ప్రాంతం ఉద్రికత్తంగా మారిపోంది. తీవ్రంగా గాయపడిన సంజీవ్‌ను వారణాసిలోని ఓ ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలోనే అతను మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే సంతోష్‌ కుమార్‌ ఘటన స్థలనికి చేరుకున్నారు. కాల్పుల ఘటనపై దర్యాప్తు చేయలని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించాంరు. 

వందల మంది స్థానికులు సంజీవ్‌ మిశ్రా మృతికి సంబంధించిన వ్యక్తులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్‌ చేశారు. సంజీవ్‌ కుమార్‌ ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు పండిట్ గిరీష్ నారాయణ్ మిశ్రా మనవడు. అతను స్థానికంగా ఓ డిగ్రీ కళాశాల నడుపుతూ.. సామాజిక సేవ చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. సంతోష్ కుమార్ మిశ్రా కార్గహార్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నేతృత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. గత 20 ఏళ్లలో సంజీవ్‌ కుమర్‌ కుటంబంలో ఇప్పటికే ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. అతని తండ్రి మహేంద్ర అలియాస్ గుమతి మిశ్రా, మామ చంద్రమా మిశ్రా, తాత పండిట్ కామతా ప్రసాద్ మిశ్రా అందరూ పార్సతువా మార్కెట్‌లో కాల్చి చంపబడ్డారు.

చదవండి: లాయర్‌ దారుణ హత్య.. కోర్టు ఆవరణలో మాటువేసి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top