Car Accident In Visakhapatnam VIP Road - Sakshi
Sakshi News home page

విశాఖలో లేడీ డాక్టర్‌ నిర్వాకం.. అర్ధరాత్రి తప్పతాగి..

Aug 2 2023 7:02 AM | Updated on Aug 2 2023 4:23 PM

Car Accident In Visakhapatnam Vip Road - Sakshi

విశాఖలో వీఐపీ రోడ్డు లో ఇన్ నోవా కారు బీభత్సం సృష్టించింది. డ్రైవింగ్ చేసిన మహిళ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. 

సాక్షి, విశాఖపట్నం: నగరంలో వీఐపీ రోడ్డులో ఓ ఇన్నోవా కారు బీభత్సం సృష్టించింది. అర్ధ రాత్రి మందుబాబులు, మందు భామలు రెచ్చిపోయారు. వీరంతా ఉన్నత చదువులు చదువుకున్నవారు గమనార్హం. ఇందులో ఓ లేడీ డాక్టర్‌, ముగ్గురు మెడికోలు ఉన్నారు. వీరు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు.. ఫుట్ పాత్ పై ఉన్న  8 టూ వీలర్లను ఢీ కొట్టింది. 

సోమా పబ్‌లో రూం నంబర్ 102 లో నలుగురు మద్యం సేవించారు. మద్యం మత్తులో అతివేగంగా డ్రైవ్ చేయడంతో అదుపు తప్పి 8  వాహనాలను కారు ఢీకొట్టింది. కారును అక్కడే వదిలేసి.. అందులో ఉన్నవారంతా పరారీ అయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మందుబాబులు అర్ధరాత్రుళ్లు తప్ప తాగి నడిరోడ్లపై డ్రంక్ అండ్ డ్రైవింగ్‌  చేస్తూ నడిరోడ్లపై టెర్రర్ పుట్టిస్తున్నారు.

ఈ ఘటన విశాఖ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి లోని సోమా పబ్ వద్ద అర్థరాత్రి చోటు చేసుకుంది. నిన్న రాత్రి ఒక లేడీ డాక్టర్, ముగ్గురు మెడికల్ స్టూడెంట్స్ ఫుల్ గా మద్యం సేవించి హంగామా సృష్టించినట్టు సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. సోమా పబ్ లో 11 గంటల వరకు రూం నంబర్ 102 లో నలుగురు మద్యం సేవించినట్టు తేలింది. వేగంగా కారుతో దూసుకొచ్చిన లేడీ డాక్టర్  8 వాహనాల ను ఢీ కొట్టినట్టు వీడియో దృశ్యాల ద్వారా తేలింది. ఇప్పటికే ఈ ఘటనపై కేసు నమోదు చేశారు విశాఖ త్రీ టౌన్ పోలీసులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement