మహిళా దినోత్సవం.. ఆపై టీ20 వరల్డ్ కప్ సమరం.. ఈ ఆదివారం క్రీడాభిమానులకు, మహిళలకు అద్భుతమైన అనుభూతిని మిగిల్చింది. ఉదయం నుంచి నగరవ్యాప్తంగా మహిళా శక్తిని కీర్తిస్తూ సత్కారాలతో సందడిగా గడిపిన విశాఖ.., సాయంత్రం కాగానే టీవీల ముందు నిశ్శబ్దంగా వేచిచూసింది. క్రీజులో భారత బ్యాటర్లు పరుగుల వరద పారించి, బౌండరీల మోత మోగిస్తుంటే సాగర తీరం ఉప్పొంగింది. ఏకంగా 255 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించి, ప్రత్యర్థిని కట్టడి చేసిన టీమిండియా చివరకు విశ్వవిజేతగా నిలిచింది. ఈ కప్పు విజయం కేవలం క్రీడా విజయం మాత్రమే కాదు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారతీయ మహిళా లోకానికి మన క్రికెటర్లు అందించిన అపురూపమైన కానుకగా నిలిచింది. నగరంలో పలు చోట్ల బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేసుకుని యువతరం మ్యాచ్‌ను వీక్షించింది. – ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం


