జగన్‌ హయాంలోనే మహిళా సాధికారత | - | Sakshi
Sakshi News home page

జగన్‌ హయాంలోనే మహిళా సాధికారత

Mar 9 2026 7:20 AM | Updated on Mar 9 2026 7:20 AM

● పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ● వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం

సాక్షి, విశాఖపట్నం: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా పాలన సాగిందని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. ఆదివారం మద్దిలపాలెంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేకే రాజుతో పాటు సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్‌కుమార్‌, మొల్లి అప్పారావు, తిప్పల దేవన్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై, మహిళా నేతలతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా మహిళా కార్పొరేటర్లను, నియోజకవర్గ, వార్డు స్థాయి మహిళా అధ్యక్షులను, సీనియర్‌ మహిళా నాయకులను ఘనంగా సన్మానించారు. అనంతరం మహిళలకు నిర్వహించిన ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ప్రతి సంక్షేమ పథకం నిధులు నేరుగా మహిళల ఖాతాల్లోనే జమ అయ్యాయని, మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే దూరదృష్టితోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చా రన్నారు. రాజకీయంగానూ నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతానికి పైగా మహిళలకే అవకాశం ఇచ్చి, చట్టసభలు, మంత్రి పదవుల్లో వారికి పెద్దపీట వేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ పేరుతో మహిళలను మోసం చేసిందని, మహిళలు ఆగ్రహిస్తే ఏ ప్రభుత్వమైనా కూలిపోక తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వానికి మహిళలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌, సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, దేవన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల కంటే అధికంగా మహిళలకు వైఎస్సార్‌సీపీ అవకాశాలు కల్పించిందన్నారు. తల్లికి వందనం, ఉచిత సిలిండర్ల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం అడ్డదారిలో అధికారంలోకి వచ్చి ఇప్పుడు మహిళలను వంచిస్తోందని విమర్శించారు. పేడాడ రమణికుమారి మాట్లాడుతూ.. దిశా చట్టం ద్వారా మహిళా భద్రతకు భరోసా కల్పించడంతో పాటు, ఇళ్ల పట్టాలను సైతం మహిళల పేరిటే అందించిన గొప్ప మనసు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదని కొనియాడారు. వేడుకల్లో మాజీ మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, ఎస్‌ఈసీ సభ్యుడు సతీష్‌ వర్మ, కార్పొరేటర్లు శశికళ, సాడి పద్మారెడ్డి, మువ్వల లక్ష్మీ సురేష్‌, మహిళా నేతలు మంచా నాగమల్లేశ్వరి, శ్రీదేవి వర్మ, పిల్లా సుజాత, పల్లా చినతల్లి, జి.వి.రమణి, శిరీష, బంగారమ్మ, ప్రశాంతి పట్నాయక్‌, రజని, సూరాడ వెంకటలక్ష్మి, ఎస్‌.వి.లక్ష్మి, పార్వతీ, రాధా, భాను, ఎస్‌.వి లక్ష్మి, సాగరిక, జోషీల, దమయంతి, ఈశ్వరి, జియ్యాని సత్య, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement