చిన్నారిని చిదిమేసిన రొటావేటర్‌   | Boy Deceased Falling In Rotavator | Sakshi
Sakshi News home page

చిన్నారిని చిదిమేసిన రొటావేటర్‌  

Sep 13 2020 8:32 AM | Updated on Sep 13 2020 8:32 AM

Boy Deceased Falling In Rotavator - Sakshi

మిడుతూరు(కర్నూలు జిల్లా): రొటావేటర్‌లో పడి ఓ బాలుడు దుర్మరణం చెందాడు. తాత అప్రమత్తతతో మరో బాలుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని ఖాజీపేట గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహబూబ్‌బాషా(మాబాషా), షంషుద్దీన్‌ బేగంకు సుహాన, రిజ్వాన్, అస్లాం కుమారులు. మొక్కజొన్న చేనులో రొటావేటర్‌ కొట్టడానికి తాత ఖాసీంవలి వెళ్తుండగా రిజ్వాన్‌(6), అస్లాం(4) వెంటపడ్డారు. స్టీరింగ్‌ వద్దే మనవళ్లను కూర్చోపెట్టుకుని పొలానికి వెళ్లాడు. అక్కడ రొటా వేటర్‌తో పొలాన్ని దున్నుతుండగా కుదుపులకు మనవళ్లు ఒక్కసారిగా కిందపడబోయారు. డ్రైవింగ్‌ చేస్తూనే అస్లాంను ఓ చేత్తో పట్టుకోగా రిజ్వాన్‌ రొటావేటర్‌లోకి పడిపోయాడు. కళ్ల ముందే నుజ్జునుజ్జు కావడంతో గుండెలు బాదుకున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని బోరున విలపించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement