వివాహేతర సంబంధం.. కన్నబిడ్డ దారుణహత్య | Boy Assasinated By Mother And Her Lover In Tamil Nadu | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం.. కన్నబిడ్డ దారుణహత్య

Jul 30 2021 8:20 AM | Updated on Jul 30 2021 8:22 AM

Boy Assasinated By Mother And Her Lover In Tamil Nadu - Sakshi

నిందితులు అపర్ణ, సురేష్‌

తిరువొత్తియూరు: వివాహేతరసంబంధానికి అడ్డుగా వున్నాడని కుమారుడిని తల్లి, ఆమె ప్రియుడు హత్య చేశారు. తంజై మేల్‌వంజూరుకు చెందిన కార్తీక్‌ అరవింద్‌ (31), అపర్ణ (22) దంపతులు. వీరి కుమారుడు సువిత్రన్‌ (04). ప్రస్తుతం నాగై, తామరకులంలో నివాసముంటున్నారు. తామరకులం ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్‌ సురేష్‌ (24)తో అపర్ణకు వివాహేతర సంబంధం ఏర్పడింది.

గత 26వ తేదీ అపర్ణ, సురేష్‌ చనువుగా కలిసి వున్న ఉన్న సమయంలో బాలుడు అడ్డుగా ఉండడంతో ఆగ్రహించిన సురేష్‌ సువిత్రన్‌పై దాడి చేశాడు. బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. అపర్ణ చున్నీతో కుమారుడి గొంతు బిగించడంతో బాలుడు మృతిచెందాడు. కార్తీక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పరారీలో వున్న అపర్ణ, సురేష్‌ను గురువారం అరెస్టు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement