బంగ్లాదేశ్‌లో విషాదం.. పడవ మునిగి 23 మంది మృతి.. పదుల సంఖ్యలో గల్లంతు

Bangladesh Boat Sinks 23 People Killed Dozens Missing - Sakshi

ఢాకా: బంగ్లాదేశ్‌లో ఆదివారం ఘోరో ప్రమాదం జరిగింది.  ఉత్తర పంచగఢ్ జిల్లాలో పడవ మునిగి 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో పదుల సంఖ్యలో ప్రయాణికులు గల్లంతయ్యారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు.

ప్రమాద సమయంలో పడవలో దాదాపు 70 మంది ఉన్నట్లు ఓ ప్రయాణికుడు చెప్పాడని అధికారులు వెల్లడించారు. ఇంకా ఎంతమైంది అదృశ్యమయ్యారని కచ్చితంగా సంఖ్య చెప్పలేమన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

బంగ్లాదేశ్‌లో  పడవ ప్రమాదాల కారణంగా ఏటా పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. జలాంతార మార్గాలు చాలా ఉన్నప్పటికీ భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది మేలో ఓ పడవ వేగంగా వెళ్లి భారీ ఓడను ఢీకొట్టిన ఘటనలో 26 మంది చనిపోయారు.
చదవండి: దేశ రాజధానిలో దారుణం.. 12 ఏళ్ల బాలుడిపై సామూహిక అత్యాచారం

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top