12 ఏళ్ల బాలుడిపై సామూహిక అత్యాచారం.. ఢిల్లీలో అబ్బాయిలకూ రక్షణ లేదు!

Minor Boy Was Raped And Beaten By Four People In Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగుచూసింది. నలుగురు కామాంధులు 12 ఏళ్ల బాలుడిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అతడ్ని కర్రలతో దారుణంగా కొట్టారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాలుడ్ని అక్కడే వదిలి పారిపోయారు.

ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్‌ స్వాతి మాలివాల్ తీవ్రంగా స్పందించారు. ఢిల్లీలో అబ్బాయిలకు కూడా రక్షణ లేదు అని మండిపడ్డారు. మహిళా ప్యానెల్ ఈ ఘటనను గుర్తించి పోలీసులతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించిందని ట్వీట్ చేశారు. ప్రస్తుతం బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు ఒక్క నిందితుడిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు. ఘటనపై మహిళా ప్యానెల్‌ ఢిల్లీ పోలీసులకు నోటీసులు పంపింది.
చదవండి: వీడియో లీక్ ఘటన.. అమ్మాయిని బ్లాక్‌మెయిల్ చేసిన ఆర్మీ జవాన్ అరెస్టు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top