గర్భస్రావమయ్యేలా దాడి.. భర్త, బంధువులకు జైలుశిక్ష 

Attack To Cause Abortion Court Imprisonment For Husband 10 Years - Sakshi

మైసూరు: గర్భిణిపై దాడి చేసి గర్భపాతానికి కారణమైన ఐదుమందికి మైసూరు ఐదవ అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు 10 సంవత్సరాల కఠిన జైలు శిక్షను విధించింది. నంజనగూడు తాలూకాలోని హొసకోటె గ్రామానికి చెందిన భర్త మహేశ్‌, అత్త చిక్క కుసుమ, బంధువులు కుసుమ, కాంతరాజు, మహాదేవమ్మ జైలు శిక్ష పడిన వారు. 

భార్య పుట్టసౌమ్యను మరింత కట్నం తేవాలని భర్త మహేష్, ఇతర బంధువులు వేధించేవారు. 2015 ఫిబ్రవరి 7వ తేదీన పుట్ట సౌమ్య ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా గర్భవతి అని తెలిపారు. నాకు చెప్పకుండా ఎందుకు ఆస్పత్రికి వెళ్లావు అని మహేశ్‌ బంధువులు ఆమెను తీవ్రంగా కొట్టడంతో అక్కడే గర్భస్రావమైంది.

దాంతో బాధితురాలు బదవనాళు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి చార్జిషీటు వేశారు. కోర్టు విచారణలో మహేశ్అ‌ త్తమామల నేరం రుజువైంది.  దీంతో జడ్జి మల్లికార్జున దోషులకు తలా 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.22 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.    

(చదవండి: నకిలీ పత్రాలతో రూ.95 లక్షల లోన్‌ )

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top