మోడలింగ్‌ మోజు.. బంధువుల ఇళ్లే టార్గెట్‌! | Aspiring Model Steals 2 Lakhs From Relative Home In Mumbai | Sakshi
Sakshi News home page

మోడలింగ్‌ మోజు.. బంధువుల ఇళ్లే టార్గెట్‌!

Nov 9 2020 5:21 PM | Updated on Nov 9 2020 5:27 PM

Aspiring Model Steals 2 Lakhs From Relative Home In Mumbai - Sakshi

శీతల్‌ నాగ్‌రాజ్‌ గోలాప్

మోడలింగ్‌ మీద ఉన్న మోజుతో లాక్‌డౌన్‌ ముందే ఉద్యోగం మానేసింది. అయితే కొద్దిరోజులకే..

ముంబై : మోడలింగ్‌ మోజుతో ఓ యువతి తప్పుదారి పట్టింది. బంధువుల ఇంట్లో దొంగతనానికి పాల్పడి చివరకు జైలు పాలైంది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబై, జోగేశ్వరి వెస్ట్‌కు చెందిన శీతల్‌ నాగ్‌రాజ్‌ గోలాప్‌ ఓ ప్రైవేట్‌ భీమా కంపెనీలో అడ్వైజర్‌గా పని చేసేది. మోడలింగ్‌ మీద ఉన్న మోజుతో లాక్‌డౌన్‌ ముందే ఉద్యోగం మానేసింది. అయితే కొద్దిరోజులకే ఆమె దాచుకున్న డబ్బు మొత్తం కరిగిపోయింది. ఈ నేపథ్యంలో తన మోడలింగ్‌ కలలు నెరవేర్చుకోవటానికి దొంగతనాలు మొదలుపెట్టింది. ( యువతి అదృశ్యం: రెండేళ్ల తర్వాత..)

బంధువల ఇళ్లలోని బంగారు నగలు, డబ్బును చోరీ చేసేది. నగలు, డబ్బు పొగొట్టుకున్న బంధువు ఒకరు కొద్దిరోజుల క్రితం ఓషివారా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. శీతల్‌పై అనుమానంతో విచారించగా దొంగతనం చెసినట్లు అంగీకరించింది. శీతల్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు ఆమె వద్దనుంచి 2 లక్షల రూపాయలు విలువచేసే నగల్ని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement