యువతి అదృశ్యం: రెండేళ్ల తర్వాత..

సాక్షి, గుంటూరు : రెండు సంవత్సరాల క్రితం చోటుచేసుకున్న ఓ యువతి హత్య తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన పాత గుంటూరు ఆలీనగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాత గుంటూరుకు చెందిన నజిమా అనే యువతి 2018లో ఓ పెళ్లికి వెళ్లింది. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతి ఆచూకీ దొరక్కపోయే సరికి కొద్దిరోజులు గాలించి వదిలేశారు. ( ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి )
అయితే తాజాగా యువతి స్నేహితులు ఇచ్చిన సమాచారంతో నజిమా తల్లిదండ్రులు ఐజీని కలిసి నాగూర్ అనే యువకుడిపై ఫిర్యాదు చేశారు. ఐజీ ఆదేశాలతో నాగూర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయట పడింది. ప్రేమ పేరుతో నజిమాను మోసం చేసి, హత్య చేసినట్లు నాగూర్ ఒప్పుకున్నాడు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి