Another Twist In Hyderabad Malakpet Anuradha Assassination Case - Sakshi
Sakshi News home page

మలక్‌పేట అనురాధ హత్య కేసులో కొత్త ట్విస్ట్‌..

May 26 2023 6:55 PM | Updated on May 26 2023 8:04 PM

Another Twist In Hyderabad Malakpet Anuradha Assassination Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మలక్‌పేట అనురాధ మృతి కేసు మరో మలుపు తిరిగింది. అనురాధ మృతి కేసు రాచకొండ పోలీసులకు బదిలీ అయింది. చంద్రమోహన్‌ రిమాండ్‌ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెల్లడయ్యాయి. 15 ఏళ్లుగా చంద్రమోహన్‌, అనురాధల సహజీవనం చేస్తున్నారు. చంద్రమోహన్‌తో అనురాధకు గత కొన్నాళ్లుగా విభేదాలు ఉన్నాయి. విభేదాల కారణంగా పెళ్లి చేసుకోవాలని అనురాధ ప్లాన్‌ చేసింది. పెళ్లి కోసం మాట్రిమోనీలో ప్రకటనలు ఇచ్చింది.

తాను పెళ్లి చేసుకోబోతున్నానని డబ్బు, నగలు తిరిగివ్వాలని చంద్రమోహన్‌ని డిమాండ్ చేసింది. రూ.17 లక్షల నగదు, 2 కిలోలకుపైగా బంగారం తిరిగివ్వాలన్న అనురాధను చంపేస్తే డబ్బులు, నగలు ఇవ్వాల్సిన అవసరముండదని హత్య చేసినట్లు తేలింది. అనురాధతో గొడవపడి 15 కత్తిపోట్లు పొడిచి చంపిన చంద్రమోహన్‌.. ఒక రోజు పాటు మృతదేహాన్ని బయటే పెట్టాడు.. అనురాధ గది పక్కన అద్దెకు ఉన్నవారు ఊరికెళ్లాక ముక్కలు చేశాడు. మరుసటిరోజు స్టోన్‌ కట్టర్ తెచ్చి మృతదేహాన్ని ముక్కలుగా చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ప్యాక్‌ చేసి ఫ్రిజ్‌లో దాచాడు. 5 రోజుల తర్వాత తలను తీసుకెళ్లి మూసీలో పడేశాడు.
చదవండి: ఆరుగురు పిల్లల తల్లి ఎంతటి దారుణానికి పాల్పడిందంటే...

యూట్యూబ్‌లో చూసి మృతదేహాన్ని ముక్కలు చేసిన చంద్రమోహన్‌.. మృతదేహం నుంచి వాసన రాకుండా కెమికల్స్‌ వాడాడు. కూతురితోపాటు బంధువులెవరితోనూ అనురాధకు సంబంధాలు లేకపోవడంతో ఆమెను చంపితే బంధువులెవరూ రారని గుర్తించిన చంద్రమోహన్‌.. అనురాధ చార్‌ధామ్‌ యాత్రకు వెళ్తున్నట్లు సృష్టించాడు. అనుమానం రాకుండా అనురాధ కూతురుతో చంద్రమోహన్‌ చాటింగ్‌ చేశాడు. అనురాధ సెల్‌ఫోన్‌ను చార్‌ధామ్‌కు తీసుకెళ్లి ధ్వంసం చేయాలని చంద్రమోహన్‌ ప్లాన్ చేసినట్లు రిమాండ్‌ రిపోర్ట్‌లో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Advertisement
 
Advertisement
Advertisement