పాకిస్తాన్‌లో హిందూ కుటుంబం దారుణ హత్య!

5 Member Hindu Family Brutally Murdered In Pakistan - Sakshi

కరాచీ: పాకిస్తాన్‌లోని ముల్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. రహీమ్‌యార్‌లోని అబుదాబి కాలనీలో హిందూ సామాజిక​ వర్గానికి చెందిన రామ్‌ చంద్‌ టైలరింగ్‌ చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

ఈ క్రమంలో శుక్రవారం నాడు గుర్తు తెలియని దుండగులు అతడి ఇంట్లోకి చొరబడి పదునైన ఆయుధాలతో కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఈ దాడిలో కుటుంబంలోని ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఘటనా స్థలంలో నిందితులు వాడిన కత్తులు, గొడ్డళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా సంచలనం రేపిన ఈ హత్యలపై కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వీరి కుటుంబం ప్రశాంతమైన జీవనం గడుపుతూ, అందరితోను కలిసిమెలిసి ఉండేవారని బిర్బల్‌డాన్‌ అనే సామాజిక కార్యకర్త తెలిపాడు.

చదవండి: రెండు వారాలుగా ‘లైంగిక దాడి’ 
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top