చిత్తూరు కార్పొరేషన్: పల్లెపోరుకు రంగం సిద్ధమైంది. సాధారణ ఎన్నికలకు భిన్నంగా పార్టీలతో సంబంధం లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం వీటి ప్రత్యేకత. ఈ ఎన్నికల్లో ఓటర్లు తెలుసుకోవాల్సిన పలు కీలక అంశాలు, నిబంధనలను గమనిద్దాం.
సర్పంచి అభ్యర్థుల కోసం 25, వార్డు సభ్యుల కోసం 20 చొప్పున గుర్తులు కేటాయించారు. వీటికి అదనంగా నోటా ఉండనుంది. అభ్యర్థుల సంఖ్య పెరిగితే కొత్త గుర్తులు కేటాయించనున్నారు.
సర్పంచ్ గుర్తులు ఇవే
టెలిఫోన్, బల్ల, మొక్కజొన్న, పలక, ద్రాక్ష పండ్లు, తిరగలి, కుండ, మంచం, కత్తెర, ఉంగరం, బుట్ట, వంకాయ, సాసరు, క్యారెట్, తాళం చెవి, గొలుసు, కుర్చీ, బ్యాట్, అరటిపండు, కొవ్వొత్తులు, నల్లబోర్డు, అనాసపండు, షటిల్, చేతికర్ర, చెంచా.
వార్డు సభ్యుల గుర్తులు
ప్రెషర్ కుక్కర్, గౌను, స్టూల్, ఇసీ్త్రపెట్టె, పోస్ట్ డబ్బా, గ్యాస్ స్టౌ, బీరువా, ఐస్క్రీమ్, డిష్ యాంటెన, రంపం, కెమెరా, క్యారమ్ బోర్డు, వయోలిన్, బెండకాయ, బెల్టు, కోటు గుర్తులు.
కొత్త బ్యాలెట్ అడిగే అవకాశం
పోలింగ్‌బూత్‌లో ఏ ఓటరైనా పొరపాటున బ్యాలెట్ పేపర్‌పై ఒక అభ్యర్థికి బదులు వేరొకరికి ఓటు గుర్తు వేసినా, పొరపాటున బ్యాలెట్ పేపర్ పాడైనప్పుడు ఆవిషయం పోలింగ్ అధి కారి దృష్టికి తీసుకెళ్లి కొత్త బ్యాలెట్ పొందే వీలున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. కానీ పోలింగ్ అధికారి ఓటర్ చెప్పిన సమస్యకు సంతృప్తి చెందితేనే కొత్త బ్యాలెట్ జారీ చేయ డం అత్యంత అరుదుగా ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు పేర్కొంటున్నారు.


