ఇప్పుడు గుర్తొచ్చిందేమో? | - | Sakshi
Sakshi News home page

ఇప్పుడు గుర్తొచ్చిందేమో?

Nov 23 2026 5:30 AM | Updated on Nov 23 2026 5:30 AM

చెత్తపెంట రోడ్డులో హడావుడిగా

మట్టి పనులు

బైరెడ్డిపల్లి– మేకలనాగిరెడ్డిపల్లి రోడ్డు అధ్వాన్నం

పలమనేరు: నియోజకవర్గంలోని పలు మండలాల్లో గ్రామీణ రహదారులు అధ్వాన్నంగా మారాయి. ఇటీవల కురసిన వర్షాలకు దెబ్బతిని రోడ్లపై గోతులు పడ్డాయి. తారురోడ్లను నాసిరకంగా వేయడంతో కంకరతేలి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు రావడంతో దుస్థితిలో ఉన్న రహదారులను చూసి జనం ఓట్లు వేయరని భావించిన కూటమి నేతలు హడావిడిగా దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా ఇలాంటి పనులను ఎలా చేస్తారని, సంబంధిత అధికారులు ఎందుకు వీటిపై చర్యలు తీసుకోలేదని వైఎస్సార్‌సీపీ నాయకులు అభ్యంతరం తెలుపుతున్నారు.

ఇదిగో సాక్ష్యం

పలమనేరు మండలం, చెత్తపెంట రోడ్డు గత కొన్నేళ్లుగా అధ్వాన్నంగా మారింది. చాలాచోట్ల కంకరతేలి కనీసం ద్విచక్ర వాహనాలు సైతం వెళ్లలేని విధంగా తయారైంది. వర్షానికి పలుచోట్ల కోతకు గురైంది. గత నెలలో ఈ రోడ్డు దుస్థితిపై సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. అయినా ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించలేదు. ఇలా ఉండగా బయ్యప్పగారిపల్లిలో ఈనెల 26న సర్పంచ్‌ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో చెత్తపెంట గ్రామస్తులు తమ గ్రామానికి రోడ్డు వేయకుండా ఓటు అడిగేందుకు ఎవరొస్తారో చూద్దామని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కూటమి నేతలు ఎన్నికల కోడ్‌ అమలూలో ఉన్నా గత రెండ్రోజుల నుంచి చెత్తపెంట రోడ్డులో అక్కడక్కడ దెబ్బతిన్న చోట్ల మట్టిని తోలే పనులను చేస్తున్నారు. ఈ పనులకు అధికారులు అనుమతులిచ్చారా లేదా కూటమినేతలే సొంత నిధులతో ఈ పనులు చేస్తున్నారా..? అనే విషయం తెలియరావడం లేదు.

బైరెడ్డిపల్లి– మేకలనాగిరెడ్డిపల్లి రోడ్డు అధ్వాన్నం

నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లి మండలం కుప్పం రహదారి నుంచి ఎంఎన్‌ఆర్‌పల్లి, ధర్మపురి మీదుగా నెల్లిపట్ల రోడ్డు దాకా ఉన్న ఎనిమిది కిలోమీటర్ల తారు రోడ్డు నాసిరకంగా పనులు చేపట్టారు. దీంతో ఇటీవల కురసిన వర్షాలతో రోడ్డు అధ్వాన్నంగా మారింది. కాగా ఇదే మార్గం ద్వారా విరుపాక్షిపురంలో పెరాలసిస్‌కు ఆయుర్వేద మందునిస్తారు. దీనికోసం పొరుగు రాష్ట్రాల నుంచి నిత్యం భారీగా వాహనాలు ఇదే మార్గంలో రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక్కడి నాసిరకంగా వేసిన రోడ్డును చూసి వారే విమర్శిస్తున్నారు.

ఓట్ల కోసం రోడ్లు వేస్తున్న కూటమి నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement