శాంతిపురం: మఠం పంచాయతీలోని సంతూరు గ్రామానికి చెందిన టీడీపీ యువ నాయకుడు ఏ.గజేంద్ర వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం పొన్నేపల్లి వద్ద వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ భరత్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం తీసుకున్నారు. 2021లో టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన గజేంద్ర స్వచ్ఛదంగా తమ పార్టీలో చేరడంపై హర్షం వ్యక్తం చేసిన భరత్, కండువా వేసి స్వాగతించారు. ప్రస్తుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థి రమణప్ప, వార్డు సభ్యుల గెలుపునకు తన వంతు కృషి చేస్తానని గజేంద్ర చెప్పారు. వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు పెద్దన్న, శ్రీరామప్ప, కావలి వెంకటరమణ, రవి, గుణ, గోపాల్, నూరుల్లా, సుభాన్, మురళి, నాగరాజు పాల్గొన్నారు.


