చిత్తూరు కలెక్టరేట్ : ప్రజాసమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తుండడంతో ఈ నెల 23న పీజీఆర్ఎస్ రద్దు చేశామన్నారు. జిల్లాలో డిసెంబర్ 3వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందన్నారు.
ఆశాజనకంగా
టమాట ధరలు
వి.కోట: వి.కోట మార్కెట్లో ఆదివారం టమాట 18 కిలోల బాక్సు ధర రూ.200 నుంచి అత్యధికంగా రూ.650 పలికింది. స్వల్పంగా ధరలు పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.


