తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం అర్ధరాత్రి వరకు 65,218 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 20,213మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.63 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.
ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి
గంగాధర నెల్లూరు : మండలంలోని వేల్కూరు పంచాయతీలో ట్రాక్టర్ కింద పడి ఓ వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. వివరాలు.. వేల్కూరు దళితవాడకు చెందిన మహేంద్ర (35 ) డ్రైవర్‌గా పనిచేసేవాడు. శుక్రవారం ఉదయం ట్రాక్టర్ తీసుకొని నీవా నది సమీపంలో వెళు తుండగా అదుపు తప్పి కింద పడ్డాడు. ట్రాక్టర్ చక్రాలు పైకి ఎక్కేయడంతో అక్కడికక్కడే మరణించాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులకు ఘటనాస్థలానికి వెళ్లి మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రాణదాన ట్రస్ట్‌కు
660 మంది ఎంపిక
తిరుపతి తుడా: టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కింద స్విమ్స్, బర్డ్ ఆస్పత్రుల్లో ఉచిత శస్త్రచికిత్సల కోసం 660 మంది పేద రోగులను ఎంపిక చేశారు. శుక్రవారం స్విమ్స్‌లో నిర్వహించిన ప్రాణదాన పథకం ఎంపిక కమిటీ సమావేశంలో పేద రోగులను కమిటీ పరీశీలించి ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది.


