జర్నలిస్టులపై దాడికి నిరసన | - | Sakshi
Sakshi News home page

జర్నలిస్టులపై దాడికి నిరసన

Nov 7 2026 1:24 AM | Updated on Nov 7 2026 1:24 AM

● బాధ్యులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆదేశించిన కలెక్టర్‌ ● గ్రామీణ విలేకరుల రక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు హామీ

చిత్తూరు కలెక్టరేట్‌ : ఎన్నికల విధులను కవర్‌ చేస్తున్న జర్నలిస్టులపై భౌతిక దాడులకు పాల్పడిన నిందితులపై కఠినంగా వ్యవహరించి, తక్షణమే కేసులు నమోదు చేయాలని ఏపీయూడబ్ల్యూజే, చిత్తూరు ప్రెస్‌ క్లబ్‌ నేతలు డిమాండ్‌ చేశారు. తవణంపల్లిలో సాక్షి జర్నలిస్టు జగన్నాథం, పాలసముద్రంలో సాక్షి జర్నలిస్టు శేఖర్‌, వి.కోటలో అక్రమ్‌ అనే మండల విలేకరులపై జరిగిన దాడులను నిరసిస్తూ చిత్తూరు లోని జెడ్పీ కార్యాలయం ఎదుట పాత్రికేయులు ఆందోళన చేపట్టారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు లోకనాథన్‌, చిత్తూరు ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు రమేష్‌ బాబు ఆధ్వర్యంలో జర్నలిస్టులు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీకి వినతిపత్రం అందజేశారు. విలేకరులపై జరిగిన దాడుల ఉదంతాలను కలెక్టర్‌కు వివరించారు. జర్నలిస్టులపై దాడుల నివారణకు ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. జర్నలిస్టుల విజ్ఞప్తిపై కలెక్టర్‌ వెంటనే స్పందించారు. దాడులకు పాల్పడిన బాధ్యులపై తక్షణమే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఎస్పీని ఆదేశించారు. అలాగే, గ్రామీణ విలేకరుల రక్షణ నిమిత్తం దాడుల నివారణ కమిటీ ఏర్పాటుపై వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి మురళీకృష్ణ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి అశోక్‌ కుమార్‌, ఉపాధ్యక్షుడు మురహరి రెడ్డి, సంయుక్త కార్యదర్శి ఇషార్‌ అహ్మద్‌, ప్రెస్‌ క్లబ్‌ కార్యదర్శి కాళేశ్వర్‌ రెడ్డి, ఏపీ ఎలక్ట్రానిక్‌ మీడియా అసోసియేషన్‌ కార్యవర్గ సభ్యుడు మనోహర్‌ రెడ్డి, సీనియర్‌ జర్నలిస్టులు వీర రాఘవ నాయుడు, మూర్తి, మహేష్‌, ప్రెస్‌ క్లబ్‌ ఉపాధ్యక్షులు శివప్రసాద్‌, పవన్‌, జర్నలిస్టులు బాలసుందరం, రాజేష్‌, మురళి, హరీష్‌, తవణంపల్లి ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు జగన్నాథం అప్పు, చంద్ర ప్రకాష్‌, శ్రీనివాసులు, చిరంజీవి, గుణ, శివ కుమార్‌, నాని పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement