వి.కోట: కుప్పం– వి.కోట జాతీయ రహదారిపై ద్విచక్రవాహనంపై వెళుతున్న యువకుడిని శుక్రవారం ఐషర్ వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. వివరాలు.. కుప్పం మండలం మారువాడకు చెందిన శేఖర్ (28) మదనపల్లిలో ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్నాడు. గురువారం జరిగిన ఎన్నికల లో ఓటు వేయడానికి వచ్చి వి.కోట మీదుగా ద్విచక్రవాహనంలో మదనపల్లెకు తిరి గి వెళుతుండగా ప్రమాదం జరిగింది. ప్రమా దం జరిగిన స్థలం కర్ణాటక పరిధిలో ఉండడంతో బేత మంగళం పోలీసులు కేసు నమోదు చేసుకుని వివరాలను సేకరిస్తున్నారు.
మరణంలోనూ వీడని బంధం
– చికిత్సపొందుతూ జీవిత మృతి
నగరి : నగరి మున్సిపల్ పరిధిలోని కాకవేడు ఎస్టీ కాలనీలో ఇద్దరు స్నేహితులు మౌనిక (15), జీవిత (17) విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు యత్నించగా, మౌనిక మరణించడం, జీవిత కొన ఊపిరితో చికిత్స పొందుతూ ఉన్న విషయం విధితమే. అయితే పరిస్థితి విషమించడంతో జీవిత కూడా శుక్రవారం ఉదయం మృత్యుడికి చేరింది. ఎప్పుడూ స్నేహితురాలిని విడవని జీవిత మరణంలోను స్నేహితురాలి వెంటే వెళ్లిపోయింది. ఒకరు మృతి చెందగా, మరొకరైనా బతికి వస్తారని ఎదురుచూసిన గ్రామస్తులకు జీవిత ఇకలేదనే వార్త శోకంలో ముంచింది. జీవిత ప్రాణాలతో వస్తే అసలు నిజం బయటపడేదని ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, మృతుల్లో మౌనిక రెండు రోజు ల క్రితం మాస్కు ధరించి ఒక గుర్తు తెలియని వ్యక్తితో వెళుతుండగా చూశామని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని, వాస్తవాలను వెలికితీయాలని కోరుతున్నారు.


