చిత్తూరు కలెక్టరేట్: విజయవాడ వేదికగా త్వరలో నిర్వహించనున్న 51వ జాతీయ మినీ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌కు రాష్ట్ర జట్టు తరఫున చిత్తూరు జిల్లాకు చెందిన ఐదుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. శనివారం ఈ మేరకు జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం అధ్యక్షుడు టి. చెంగల్రాయ నాయుడు, కార్యదర్శి జి. సురేష్ బాబు, ఎన్‌పీ జయప్రకాష్ ఎంపికై న క్రీడాకారులను అభినందించారు. వారు మాట్లాడుతూ బాలికల విభాగంలో హర్షిత, మనస్విని, సోనాల్, బాలుర విభాగంలో నాగసూర్య జాతీయ పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి శిక్షణ శిబిరంలో చూపిన అత్యుత్తమ ప్రతిభ ఆధారంగా వీరు జాతీయ జట్టుకు ఎంపికయ్యారని చెప్పారు. గతంలోనూ చిత్తూరు జిల్లా జట్లు రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచి సత్తా చాటాయన్నారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులను కోచ్‌లు ఉదయభాస్కర్, బాబు, భాను, సంగీత, నటరాజ్ ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ పోటీల్లోనూ రాణించి రాష్ట్రానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఎంపికై న క్రీడాకారులు


