మార్ఫింగ్‌ వీడియోపై మండిపాటు | - | Sakshi
Sakshi News home page

మార్ఫింగ్‌ వీడియోపై మండిపాటు

Sep 27 2026 3:28 AM | Updated on Sep 27 2026 3:28 AM

● మాజీ మంత్రి రోజాను కించపరచడంపై ఆగ్రహం ● పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు

నగరి : మాజీ మంత్రి ఆర్‌కే రోజాకు సంబంధించిన వీడియోను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 24న తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన రోజా ఆలయం వెలుపలికి వస్తున్న సమయంలో మీడియా చిత్రీకరించిన వీడియోలను కొందరు వ్యక్తులు ఏఐ సాంకేతికతతో మార్పులు చేసి, ఆమె గుండు కొట్టించుకున్నట్లు కనిపించే విధంగా తప్పుడు వీడియోలను రూపొందించి సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం నగరికి చెందిన నేతలు ఈ మేరకు సీఐ మల్లికార్జునరావు, నిండ్ర మండల నేతలు ఎస్‌ఐ మల్లికార్జునకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగామ్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌, వాట్సాప్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో మార్ఫింగ్‌ వీడియోలు పోస్టులు, రీల్స్‌, షేర్లు, ఫార్వర్డ్‌ రూపంలో ప్రచారం అవుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై సాంకేతిక ఆధారాలతో సమగ్ర దర్యాప్తు జరిపి, వీడియోను రూపొందించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మార్ఫింగ్‌ వీడియోలను ఎవరు మొదట రూపొందించారు, ఏ ఖాతా నుంచి తొలిసారిగా సోషల్‌ మీడియాలోకి తీసుకువచ్చారు, అనంతరం ఎవరెవరు షేర్‌, రీపోస్ట్‌, ఫార్వర్డ్‌ చేశారనే అంశాలను సాంకేతికంగా గుర్తించాలని పోలీసులను కోరారు. వీడియోలను తయారు చేయడం, ప్రచారం చేయడం లేదా ఉద్దేశపూర్వకంగా వైరల్‌ చేయడంలో ఎవరెవరి ప్రమేయం ఉందో తేల్చాలని కోరారు.

అత్యంత అభ్యంతరకరం

ఫిర్యాదు చేసిన అనంతరం పార్టీ నేతలు మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి రోజాను వాస్తవానికి భిన్నంగా చిత్రీకరించి ప్రజల్లో తప్పుడు భావన కలిగించేలా వీడియోలను ప్రచారం చేయడం అత్యంత అభ్యంతరకరమని స్పష్టం చేశారు. సాధారణ రాజకీయ విమర్శలకు, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా డిజిటల్‌ మార్పులతో తప్పుడు వీడియోలు సృష్టించి ప్రచారం చేయడానికి తేడా ఉందని తెలిపారు. రాజకీయ విభేదాలతో ఒక మహిళా నాయకురాలి వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా తప్పుడు కంటెంట్‌ను సృష్టించడం సమర్థనీయం కాదన్నారు. వీడియోల వెనుక టీడీపీకి అనుబంధంగా పనిచేస్తున్న కొంతమంది సోషల్‌ మీడియా కార్యకర్తలు, వ్యక్తుల పాత్రపై కూడా దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్దేశపూర్వకంగా వైరల్‌ చేసినా ఆధారాల మేరకు ఇన్ఫర్మేమేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌ 2000తో పాటు దర్యాప్తులో వర్తించే ఇతర చట్టాల కింద కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నగరి పట్టణ, రూరల్‌ అధ్యక్షులు రమేష్‌రెడ్డి, తిరుమల రెడ్డి, నేతలు కన్నాయిరం, గోపాల్‌రెడ్డి, ఇంద్రారెడ్డి, మునివేలు, మురుగ, కృష్ణమూర్తి, ఆనందకుమార్‌, సలీం, యాకోబు, కన్నియప్ప, నాగభూషణం, వెంకటేశ్‌, రాజముత్తు, హరి, అముద, సంధ్యారాణి, శశికళ, పాండియన్‌, మేషాక్‌, భాస్కర్‌, రమేష్‌, పార్టీ నిండ్ర మండల కన్వీనర్‌ వేణురాజు, మాజీ ఎంపీపీ దీప, నేతలు అనిల్‌, విజేష్‌, మేరీ, రామచంద్రారెడ్డి, నవీన్‌, చెంచమ్మ పాల్గొన్నారు.

వడమాలపేటలో..

తప్పుడు పోస్టులపై ఫిర్యాదు

పుత్తూరు: మాజీ మంత్రి ఆర్కే రోజాపై సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన టీడీపీ అనుబంధ సంస్థలకు చెందిన వ్యక్తులను అరెస్ట్‌ చేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ పుత్తూరు నేతలు ఎస్‌ఐ వెంకటలక్ష్మీకి ఫిర్యాదు చేశారు. మార్ఫింగ్‌ వీడియోలను ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగామ్‌, ఎక్స్‌, యూట్యూబ్‌, వాట్సాప్‌ తదితర సోషల్‌ మీడియాల్లో పోస్టులు పెట్టి మాజీ మంత్రి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై సాంకేతిక ఆధారాలతో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ హరి, మాజీ వైస్‌ చైర్మన్లు శంకర్‌, జయప్రకాష్‌, పార్టీ పుత్తూరు పట్టణ, రూరల్‌ అధ్యక్షులు ఏకాంబరం, భాస్కర్‌యాదవ్‌, నేతలు దిలీప్‌కుమార్‌, గోవిందస్వామిరెడ్డి, చక్రపాణి, బాలసుబ్రమణ్యం, ప్రతాప్‌, శివ, రాంబత్తయ్య, బాబు, దాసు, రవి తదితరులు పాల్గొన్నారు.

వడమాలపేటలో..

మాజీ మంత్రి ఆర్కే రోజాపై సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం వడమాలపేట ఎస్‌ఐ హరీష్‌కు వైఎస్సార్‌సీపీ స్థానిక నేతలు ఫిర్యాదు చేశారు. సుబ్రమణ్యంరెడ్డి, సురేష్‌రాజు, మధన్‌మోహన్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, గాంధీ, చంద్రరెడ్డి, ప్రతిమ, మంజులారెడ్డి, ఉమాపతి, భరత్‌, చంద్ర, పవన్‌, రాజేంద్రయ్య, కమలమ్మ, బత్తయ్య, బుచ్చిరెడ్డి, ధర్మయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement