వైభవంగా పౌర్ణమి గరుడసేవ | - | Sakshi
Sakshi News home page

వైభవంగా పౌర్ణమి గరుడసేవ

Sep 27 2026 3:28 AM | Updated on Sep 27 2026 3:28 AM

తిరుమల: తిరుమలలో శనివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. వాహన సేవలో తిరుమల పెద్ద జీయర్‌ స్వామి, చిన్నజీయర్‌ స్వామి, టీటీడీ అదనపు ఈవో సి.హెచ్‌.వెంకయ్యచౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

నిర్బంధం

తిరుపతి అర్బన్‌ : సచివాలయ ఉద్యోగులు చలో విజయవాడకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పలువురు ఉద్యోగులు శనివారం సాయంత్రం బయల్దేరి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఆదేశాలతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆరో వార్డు సంక్షేమ కార్యదర్శి అమరావతి, 25వ వార్డు సంక్షేమ కార్యదర్శి రజినీకుమారిని అక్రమంగా అరెస్ట్‌ చేసి ఈస్ట్‌పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధించారు. దీనిపై ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి.

శ్రీవారి దర్శనానికి 20 గంటలు

తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 66,014 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,092 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుక ల రూపంలో హుండీలో రూ.4.44 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కె ట్లులేని వారు స్వామిని దర్శించుకోవడానికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్ర మే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలో కి అనుమతించరని స్పష్టంచేసింది.

పవిత్రం.. పరిసమాప్తం

చంద్రగిరి:తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మ వారి ఆలయంలో మూడు రోజులుగా నిర్వహించిన పవిత్రోత్సవాలు శనివారం మహాపూర్ణాహుతి తో వైభవంగా ముగిశాయి. చివరి రోజైన శనివా రం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఉదయం 10.40 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మహాపూర్ణాహుతి, శాంతి హోమం, కుంభప్రోక్షణ, నివేదన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. మ ధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శ్రీకృష్ణ స్వామి ముఖ మండపంలో శ్రీపద్మావతి అమ్మవారితో పాటు శ్రీకృష్ణస్వామివారు, శ్రీసుందరరాజ స్వామి వారు, శ్రీసుదర్శన చక్రత్తాళ్వార్‌కు స్నపనతిరుమంజనం నిర్వహించారు. అనంతరం శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌ను పల్లకీపై మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా పద్మపుష్కరిణి వద్దకు తీసుకెళ్లి చక్రస్నానం నిర్వహించారు.

వైభవోత్సవం

సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీకృష్ణస్వామివారు, శ్రీసుందరరాజస్వామివారు, పద్మా వతి అమ్మవారు మాడ వీధుల్లో విహరించారు. టీటీడీ ఈఓ రవిచంద్ర, జేఈఓ శరత్‌, సీవీఎస్వో మురళీకృష్ణ, ఎస్పీ సుబ్బరాయుడు, డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement