దివ్యాంగుల హక్కుల రక్షణకు కృషి | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగుల హక్కుల రక్షణకు కృషి

Sep 27 2026 3:28 AM | Updated on Sep 27 2026 3:28 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని నూతనంగా ఎన్నికై న పర్సన్‌ విత్‌ డిజేబుల్డ్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు లోకనాథం తెలిపారు. శనివారం నగరంలోని తపోవనం పాఠశాలలో సంఘం నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు.సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండమరి సుబ్రమణ్యం అధ్యక్షతన ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా పి.లోకనాథం జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా సుబ్రమణ్యం, ఉపాధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా పెరుమాళ్‌, జాయింట్‌ సెక్రటరీగా రవి, కోశాధికారిగా వేలు, అధికార ప్రతినిధిగా శేఖర్‌ నాయుడు, కార్యవర్గ సభ్యుడిగా చంద్రమోహన్‌న్‌ ఎన్నికయ్యారు. అలాగే జిల్లాలోని వివిధ నియోజకవర్గాల బాధ్యులను ప్రకటించారు. పుంగనూరు బాధ్యుడిగా వెంకటరమణ, నగరికి మాతయ్య, పలమనేరుకు చంద్రమౌళి, కుప్పానికి నారాయణప్ప, పూతలపట్టుకి బాలయ్య, చిత్తూరు నియోజకవర్గ బాధ్యుడిగా సురేష్‌ నాయుడును ఎన్నుకున్నారు.

సదరం వెరిఫికేషన్‌లో పారదర్శకత అవసరం

సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండమరి సుబ్రమణ్యం మాట్లాడుతూ సదరం సర్టిఫికెట్ల వైకల్య శాతం పునఃపరిశీలన (వెరిఫికేషన్‌) ప్రక్రియపై ప్రభుత్వం పారదర్శకత పాటించాలని డిమాండ్‌ చేశారు. అర్హులైన దివ్యాంగులు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని కోరారు. దివ్యాంగులకు ఉచిత విద్య, వైద్యంతో పాటు నివాస గృహాలు మంజూరు చేయాలని సూచించారు. దివ్యాంగుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు.కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సలహాదారు సుబ్రమణ్యం, కార్యవర్గ సభ్యులు ఫక్రుద్దీన్‌, సుగుణమ్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement