రసాయన రహిత మామిడితో ఆదాయం | - | Sakshi
Sakshi News home page

రసాయన రహిత మామిడితో ఆదాయం

Sep 25 2026 1:47 AM | Updated on Sep 25 2026 1:47 AM

తిరుపతి కల్చరల్‌: రైతులు రసాయన అవశేషాలు లేని, నాణ్యత కలిగిన మామిడి ఉత్పత్తులు పండించినప్పుడే మంచి గిట్టుబాటు ధరతో పాటు, ఎలాంటి ఆటంకాలు లేకుండా విదేశాలకు మామిడి ఉత్పత్తులు ఎగుమతి చేసి ఆదాయం పొందవచ్చని రాస్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఎస్‌.వెంకటరత్నం తెలిపారు. రాస్‌, రాస్‌ కృషి విజ్ఞానకేంద్రం ఆధ్వర్యంలో కోకాకోలా ఇండియా పౌండేషన్‌, న్యూడిల్లీ వారి సహకారంతో గురువారం రాస్‌ సేవా నిలయంలో మామిడిలో సుస్థిర ఆదాయ మె లకువలపై రైతులకు శిక్షణ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ రైతులు శాస్త్రవేత్తలు సూచించిన ప్రకారం యాజమాన్య పద్దతులు పాటించి, జీవన ఎరువులు ,సూక్ష్మ పోషకాలు వాడాలని తెలిపారు. సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ శ్రీనివాసులు మాట్లాడుతూ ఉన్నతి మ్యాంగో ప్రాజెక్టులో భాగంగా ఇది వరకే చేపట్టిన వివిధ కార్యక్రమాలు, వాటి ప్రభావం గురించి వివరించారు. ఉద్యాన శాస్త్రవేత్త పీఎస్‌.సుధాకర్‌ మాట్లాడుతూ కొమ్మ కత్తిరింపులు చేసిన తోటలలో యూరియా 10 గ్రాము లు, సూఓ్మపోషకాల మిశ్రమం 5 గ్రాముల చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేస్తే త్వరగా కొత్త చిగురు పెరిగి పూత తొందరగా వస్తుందని తెలిపారు. జీవన ఎరువులైన అజోస్పైరిల్లం, ఫాస్పోబాక్టిరియా, పొటాషియం మొబిలైజింగ్‌ బాక్టీరియాల మిశ్రమాన్ని వినియోగించటం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందవచ్చని తెలిపారు. విస్తరణ శాస్త్రవేత్త రాముకుమార్‌ మాట్లాడుతూ కృషి విజ్ఞాన కేంద్రం చేపడుతున్న భూసార పరీక్ష ఆధారిత ఎరువుల యాజమాన్యం, ఆహార ఉ ద్యాన పంటలలో ఎల్‌నినో పరిస్థితుల్లో తీసుకోవాల్సిన మెలకువలు, వ్యవసాయ డ్రోన్‌ సాంకేతికత గురించి వివరించారు. ఈ సందర్భంగా వంద మంది మామిడి రైతులకు ప్రదర్శనా క్షేత్రాల నిర్వహణ కోసం ఎన్‌పీకే జీవన ఎరువుల మిశ్రమం, కానుగ నూనె, సూక్ష్మ పోషకాల మిశ్రమం, మ్యాంగో స్పెషల్‌ పంపిణీ చేశారు.

మిలటరీ స్కూల్స్‌లో ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు

తిరుపతి అర్బన్‌: రాష్ట్రీయ మిలటరీ స్కూల్స్‌లో 2027–28 సంవత్సరంలో 6, 9 తరగతుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదలైనట్లు కోచింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, విశ్వం పోటీ పరీక్షల సమాచార కేంద్రం అధినేత ఎన్‌.విశ్వనాథ్‌ రెడ్డి గురువారం తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల సమర్పణకు అక్టోబర్‌ 20 వరకు గడువు ఉందని చెప్పారు. డిసెంబర్‌ 13న పరీక్ష ఉంటుందని తెలిపారు. నిర్దేశిత వయోపరిమితి, అర్హతలకు అనుగుణంగా ప్రస్తుతం 5 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులని తెలిపారు. అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు, పరీక్షా విధానం, శిక్షణ, మాక్‌ టెస్టుల వివరాల కోసం 86888 88802, 93999 76999 నంబర్లను తిరుపతి వరదరాజనగర్‌లోని విశ్వం సైనిక్‌–నవోదయ పోటీ పరీక్షల కేంద్రాన్ని సంప్రదించవచ్చని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement