అధికార నంది వాహనంపై
ఊరేగుతున్న
వరసిద్ధి వినాయకుడు
ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా గురువారం కాణిపాకంలో శ్రీసిద్ధి బుద్ధి సమేత వినాయకస్వామి అధికార నంది వాహనంపై కటాక్షించారు. కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి క్షేత్రంలో గురువారం ప్రత్యేక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా మూలవిరాట్ అభిషేక పూజలు చేయించారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. రాత్రి వళ్లువర్ వంశస్తుల ఆధ్వర్యంలో అధికార నంది వాహన సేవను నిర్వహించారు. తొలుత ఉత్సవమూర్తిని అలంకరించి నంది వాహనంపై ఆశీనులను చేశారు. ప్రత్యేక పూజలు చేసి గ్రామోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఊరేగింపుగా వస్తున్న స్వామి వారికి భక్తులు కర్పూర హారతులు పట్టి తరించారు. – కాణిపాకం


