వైభవంగా విశ్వగురు సంకల్ప సిద్ధి మహాయాగం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా విశ్వగురు సంకల్ప సిద్ధి మహాయాగం

Sep 23 2026 12:25 AM | Updated on Sep 23 2026 12:25 AM

నారాయణవనం: స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాల ఆవరణలో జరుగుతున్న నవాహ్నిక భారత విశ్వగురు సంకల్ప సిద్ధి మహాయాగంలో మంగళవారం ఉదయం ఆకల్మష హోమం, సాయంత్రం చతుర్వేదాల నడుమ వైభవంగా మహా పుష్పయాగం నిర్వహించారు. అంతకుముందు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్‌ ఆధ్యాత్మిక, ఆధునిక పోకడలపై ఉపన్యసించారు. ఉదయం 8 గంటలకు హోమశాలలో 108 హోమ గుండాలలో రిత్వికులు ఆకల్మష యాగాన్ని నిర్వహించారు. పూర్ణాహుతి క్రతువులో టీటీడీ బోర్డు మెంబర్‌ భానుప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు. సాయంత్రం నిర్వహించిన ప్రవచన కార్యక్రమంలో ముఖ్యవ్యక్తగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్‌ హాజరై ప్రసంగించారు. ప్రధాని నరేంద్రమోదీ ఆయురారోగ్యాలు, 2047 వరకు ఆయన నాయకత్వంలో దేశాభివృద్ధి, వర్షాలు సమృద్ధిగా కురిసి దేశం సస్యశ్యామలంగా ఉండాలని కోరుతూ కళాశాల చైర్మన్‌ అశోక్‌రాజు దంపతులు ఈ నవాహ్నిక దీక్షలు చేపట్టారని తెలిపారు. మత సామరస్యాన్ని చాటుతూ ముస్లిం సోదరులు మహాయాగంలో పాల్గొన్నారు. మనుష్యుల్లో కల్మషాలు తొలగి ఐక్యత పెరగడానికి ఆకల్మష హోమం, యాగ నిర్వహణలోని లోటుపాట్ల నివృత్తికి, ఉపశమనానికి మహా పుష్పయాగం నిర్వహించినట్లు అశోక్‌ రాజు తెలిపారు. నవాహ్నిక యాగాలలో చివరి రోజైన బుధవారం ఉదయం మహా పూర్ణాహుతి, సాంస్కృతిక కార్యక్రమాలలో భక్తులందరూ పాల్గొనాలని అశోక్‌రాజు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement