కలకలం రేపిన ప్రెస్‌మీట్‌ | - | Sakshi
Sakshi News home page

కలకలం రేపిన ప్రెస్‌మీట్‌

Sep 23 2026 12:25 AM | Updated on Sep 23 2026 12:25 AM

● టీడీపీ నేతలతో వేదిక పంచుకున్న ప్రభుత్వోద్యోగి ● కలెక్టర్‌ అనుమతి లేకుండా ఎమ్మెల్యే పీఏ మీడియా సమావేశం ● నిబంధల బేఖాతర్‌పై ఉద్యోగ సంఘాల ఆగ్రహం

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: చిత్తూరు మండలం నాయని చెరువులో ఎమ్మెల్యే పీఏ అక్రమంగా క్వారీ నిర్వహిస్తున్నారంటూ కొన్నిరోజులుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలను ఖండించేందుకు ఎమ్మెల్యే పీఏ కుమారస్వామి మంగళవారం చిత్తూరు నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, ఒక ప్రభుత్వ ఉద్యోగి రాజకీయపార్టీ నేతలతేఓ కలిసి వేదిక పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం ఒక ఉద్యోగిపై ఆరోపణలు వస్తే అధికారిక ప్రకటన ద్వారా ఖండించడం లేదా జిల్లా పరిపాలనాధికారి ముందస్తు అనుమతి తీసుకుని ప్రెస్‌మీట్‌ పెట్టడం పరిపాటి. కానీ, అందుకు విరుద్ధంగా ఏకంగా రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలను పక్కన కూర్చోబెట్టుకుని ప్రెస్‌మీట్‌ నిర్వహించడం సర్వీస్‌ నిబంధనలను ధిక్కరించడమేనని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపైఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement