అభివృద్ధి పనులకు శంకుస్థాపన | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Sep 22 2026 5:16 AM | Updated on Sep 22 2026 5:16 AM

కుప్పం : కుప్పం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పురపాలక పరిధిలో రూ.184 కోట్లతో నిర్మించనున్న అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీకి భూమి పూజ చేశారు. రూ.13కోట్లతో నిర్మించనున్న ఏఎస్పీ, ఆర్‌డీఓ కార్యాలయ భవనాల పనులకు శ్రీకారం చుట్టారు. పది ఎకరాల విస్తీర్ణంలో మల్లానూరు జూనియర్‌ కళాశాల నిర్మాణానికి సైతం శంకుస్థాపన చేశారు. 3.30 కోట్లతో నిర్మించనున్న సమగ్ర ఘన వ్యర్థాల నిర్వాహణ ప్లాంట్ల పనులను ప్రారంభించారు. అలాగే రూ.32 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకస్థాపన చేశారు. 35 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.15 కోట్లు మంజూరు చేశారు. తంబిగానిపల్లె వద్ద నూతనంగా నిర్మించనున్న రైతు బజారుకు భూమి పూజ చేపట్టారు. కుప్పంమార్కెట్‌ యార్డులో 2.5 కోట్లతో పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. రూ.16 కోట్ల వ్యయంతో బీటీ, సీసీ రోడ్లు నిర్మించేలా హెరిటేజ్‌ గ్రానైట్‌ స్టోన్‌ క్రషర్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

అధికార బలంతో ఆక్రమణ

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం):అధికార బలంలో టీడీపీ నేతలు సాక్షాత్తు ఆంజనేయస్వామి ఆల య భూమికే ఎసరు పెట్టారని హిందూ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు రామమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం చిత్తూరు ప్రెస్‌ క్లబ్‌లో ఆయన మాట్లాడారు. వెదురుకుప్పం మండలం దేవళంపేటలోని శ్రీభక్తాంజనేయ స్వామి ఆలయ భూములను టీడీపీ నేతలు ఆక్రమించుకుంటుంటే దేవదాయ, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఓ ప్రజాప్రతినిధి అండదండలతో పచ్చమూక ఆలయ భూములను సైతం వదలడం లేదని ఆరోపించారు. పురాతన ఆంజనేయస్వామి ఆలయానికి తూర్పు వైపున ఉన్న విలువైన స్థలాన్ని అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. ఈ అక్రమ నిర్మాణాల కారణంగా మురుగు వ్యర్థాలు ఆలయ ప్రాంగణంలోకి చేరుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే పనులను మానుకుంటే న్యాయపోరాటానికి దిగుతామని హెచ్చరించారు.

శ్రీవారి దర్శనానికి

6 గంటలు

తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 72,019 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,431 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.50 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement