● అర్హత లేకపోయినా అండగా నిలుస్తున్న టీడీపీ నేతలు ● కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియలో అక్రమాలు ● విచారణలో వెలుగులోకి వాస్తవాలు ● వివరాలు సేకరిస్తున్న సచివాలయ ఉద్యోగులు | - | Sakshi
Sakshi News home page

● అర్హత లేకపోయినా అండగా నిలుస్తున్న టీడీపీ నేతలు ● కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియలో అక్రమాలు ● విచారణలో వెలుగులోకి వాస్తవాలు ● వివరాలు సేకరిస్తున్న సచివాలయ ఉద్యోగులు

Sep 22 2026 5:16 AM | Updated on Sep 22 2026 5:16 AM

● అర్హత లేకపోయినా అండగా నిలుస్తున్న టీడీపీ నేతలు ● కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియలో అక్రమాలు ● విచారణలో వెలుగులోకి వాస్తవాలు ● వివరాలు సేకరిస్తున్న సచివాలయ ఉద్యోగులు

చిత్తూరు కలెక్టరేట్‌ : ఎలాగైనా పింఛన్‌ పొందాలనే లక్ష్యంతో పెద్దసంఖ్యలో దరఖాస్తుదారులు టీడీపీ నేతల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు నాయకులు డబ్బులు సైతం డిమాండ్‌ చేస్తున్నారు. దరఖాస్తు ఆమోదం పొందితే నెలనెలా పింఛను వస్తుంది.. పోతే రూ.30 వేల వరకు పోతుందనే ఉద్దేశంతో చాలామంది నగదు ఇచ్చేందుకు వెనకాడడం లేదు. ఇలా గ్రామాలు, పట్టణాల్లో పలువురు దరఖాస్తుదారులు అక్రమంగా టీడీపీ నేతలతో సిఫార్సు చేయించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. వివిధ పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నవారిలో 10 నుంచి 25 శాతం వరకు అనర్హులే ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఆధార్‌లో మార్పులు చేయించి..

వృద్ధాప్య పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నవారిలో 60 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారు పలువురు ఉన్నట్లు సమాచారం. వీరు ఆధార్‌ కార్డులో వయసు మార్పు చేయించుకుని పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఒంటరి మహిళల పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నవారిలో సైతం పలువురు అనర్హులున్నట్లు చర్చ సాగుతోంది. వీటన్నింటిపై విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పలువురు కోరుతున్నారు.

పచ్చనేతల అండతోనే బోగస్‌ దందా

కొత్త పింఛన్‌ల దరఖాస్తును ఆసరాగా చేసుకుని అన్ని సౌకర్యాలు ఉన్నవారు, భారీగా ఆస్తులున్న వారు, అర్హత లేని వ్యక్తులు సైతం పింఛన్‌ జాబితాలో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు రంగంలోకి దిగి నకిలీలకు కొత్త పింఛన్‌లు ముట్టజెప్పేందుకు చర్యలు చేపడుతున్నారు. తమ అనుచరులకు, తాము చెప్పిన వారికి ఎలాగైనా పింఛన్‌లు మంజూరు చేయించేందుకు సచివాలయ సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. దాదాపు అన్ని వృత్తుల్లోనూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. చేనేత, డప్పు, చర్మకారులు, దివ్యాంగుల పింఛన్‌ల కేటగిరీల్లో అర్హత లేని వ్యక్తుల నుంచి నకిలీ పత్రాలు తయారు చేయిస్తున్నట్లు విమర్శలు వెలువెత్తుతున్నా యి. నకిలీ పత్రాలు దరఖాస్తు చేయించడంలో టీడీపీ నాయకులే కీలకపాత్ర పోషిస్తున్నారని సమాచారం.

జిల్లా సమాచారం

పింఛన్‌ విభాగం అందిన దరఖాస్తులు డప్పు కళాకారులు 2,970

దివ్యాంగులు 7,673

మత్స్యకారులు 64

వృద్ధులు 23,304

ఒంటరి మహిళలు 250

కల్లుగీత కార్మికులు 104

చర్మకారులు 372

ట్రాన్స్‌జెండర్లు 11

చేనేత కార్మికులు 116

వితంతువులు 8,629

మొత్తం 43,493

సొసైటీల చేతివాటం

పింఛన్ల మంజూరులో భాగంగా 50 ఏళ్లు నిండిన చేనేత కార్మికుల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించారు. నిబంధనల ప్రకారం ఈ విభాగంలో పింఛనుకు దరఖాస్తు చేసుకునేవారి ప్రధాన జీవనోపాధి చేనేత వృత్తిగా ఉండాలి. సొసైటీలో సభ్యత్వం ఉండాలి. ఆయా సొసైటీలు ఇచ్చిన గుర్తింపు పత్రంతో చేనేత, జౌళి శాఖకు దరఖాస్తు చేసుకుంటే పింఛన్‌్‌ మంజూరుకు కావాల్సిన ధ్రువీకరణపత్రం ఇస్తారు. దీంతో పింఛనుకు దరఖాస్తు చేసుకోవచ్చు. చాలామంది నేత కార్మికులు కాకపోయినప్పటికీ పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొన్ని చేనేత సొసైటీలు నిబంధనలకు విరుద్ధంగా గుర్తింపు పత్రాలు ఇచ్చాయనే ఆరోపణలున్నాయి. డప్పు కళాకారుల పింఛనుకు దరఖాస్తు చేసుకున్న వారిలోనూ కొందరు అనర్హులున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement