తిరుపతి తుడా: స్విమ్స్ ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారులకు అరుదైన క్లిష్టమైన శస్త్ర చికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారని డైరెక్టర్ డాక్టర్ జగదీష్ తెలిపారు. అన్నమయ్య జిల్లా, రాయచోటికి చెందిన రెండేళ్ల బాలిక కడుపులో అసాధారణంగా మాస్ గుర్తించడంతో తల్లిదండ్రులు చిన్నారిని స్విమ్స్‌కు తీసువచ్చారని తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం చిన్నారి కుడి కిడ్నీలో ట్యూమర్ ఉన్నట్లు నిర్ధారించి డాక్టర్ భార్గవి ఆధ్వర్యంలోని వైద్య బృందం చిన్నారికి నాలుగు సైకిళ్ల కీమోథెరపీ చికిత్సను పూర్తి చేశారని తెలిపారు. అలాగే తిరుపతి జిల్లా, పుత్తూరు మండలానికి చెందిన రెండేళ్ల బాలుడు విల్మ్‌స్ ట్యూమర్‌తో స్విమ్స్‌లో చేరారని, మూడు నెలల క్రితం ఈ చిన్నారికి మెడికల్ ఆంకాలజీ విభాగం డాక్టర్ భార్గవి బృందం కీమోథెరపీ అందించగా, అనంతరం సర్జికల్ ఆంకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ మణిలాల్ నేతృత్వంలోని వైద్య బృందం విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించినట్టు తెలిపారు.


