పుత్తూరు:రామకృష్ణాపురం పంచాయతీ మిట్టపాళెం గ్రామ సమీపంలో శనివా రం రాత్రి టెంకాయ చెట్టు పైన పడడంతో యువకు డు మృతిచెందాడు. పోలీసు ల కథనం మేరకు.. పుత్తూ రు మండలం ఎగవ గూళూరు హరిజనవాడకు చెందిన ఎ.కె.విశాల్(18), అతని మిత్రుడు వి.గణేష్(18) శనివారం రాత్రి 9 గం టల సమయంలో బైక్‌లో మిట్టపాళెం గ్రామాని కి బయలుదేరా రు. బైక్‌ను అతివేగంగా నడపడంతో అదుపు తప్పి రోడ్డు సమీపంలోని టెంకాయ చెట్టును బలంగా ఢీకొన్నారు. ఇద్దరూ కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో టెంకాయ చెట్టు మొదలు బలహీనంగా ఉండడంతో విశాల్‌పై పడింది. గాయపడ్డ వీరిని పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ చికిత్స పొందు తూ విశాల్ మృతి చెందాడు. గణేష్ చికిత్స పొందుతున్నాడు. మృతుడు విశాల్ ఐటీఐ చేస్తుండగా, గణేష్ ఇంటర్ చదువుతున్నాడు. మృతుడు తండ్రి శేఖర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీఆర్‌ఎస్‌ఏ
రాష్ట్ర సెక్రటరీగా శేషగిరిరావు
చిత్తూరు కలెక్టరేట్ : ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీగా శేషగిరిరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలో ఆదివారం ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో చిత్తూరు కలెక్టరేట్‌లో ఇన్‌సెక్షన్ సూపరింటెండెంట్, తహసీల్దార్‌గా పనిచేస్తున్న శేషగిరిని ఎన్నుకున్నారు. ఆయ న విలేకరులతో మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తారని చెప్పా రు. రెవెన్యూ ఉద్యోగుల అపరిష్కృత సమస్యల ను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులు, ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు చర్చిస్తామన్నారు. నూతనంగా ఎన్నికై న ఆయనకు జిల్లా రెవెన్యూ ఉద్యోగులు హుస్సేన్, హేమాద్రి, సంపత్, శివకుమార్ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రాణాలు తీసిన నిద్రమత్తు
ఐరాల: నిద్రమత్తు ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. మండలంలోని బొమ్మసముద్రం బ్రిడ్జి సమీపంలోని తిరుపతి– బెంగళూరు జాతీ య రహదారిపై ఆదివారం సాయంత్రం కారు డివైడర్‌ను ఢీకొనడంతో తమిళనాడుకు చెందిన ఇద్దరు మృతి చెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాణిపాకం ఎస్‌ఐ నరసింహులు కథనం మేరకు.. తమిళనాడులోని వాణియంబాడికి చెందిన అశ్విన్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం కారులో తిరుమలకు వెళ్లారు. తిరుమల బ్రహ్మోత్సవాలను తిలకించి, శ్రీవారిని దర్శించుకుని తిరిగి ఆదివారం స్వగ్రామానికి బయలుదేరారు. అశ్విన్ కారును నడుపుతుండగా బొమ్మసముద్రం బ్రిడ్జి సమీపంలోని తిరుపతి– బెంగళూరు జాతీయ రహదారిపై నిద్రమత్తులోకి జారుకున్నాడు. ఈ క్రమంలో కారు డివైడర్‌ను బలంగా ఢీకొంది. దీంతో అశ్విన్ కుమార్తె కీర్తికశ్రీ(10) అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన అశ్విన్, భార్య షణ్ముఖప్రియ, అత్త జయంతి, మామ కుత్తుస్వామి, వెన్మధి, సాయిసుధన్‌ను హైవే అంబులెన్స్‌లో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ జయంతి(52) చికిత్స పొందుతూ మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం రాణిపేట సీఎంసీకి తరలించారు. ఈ ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


