‘ఒమేగా’లో క్యాన్సర్‌కు ఉచిత వైద్యం | - | Sakshi
Sakshi News home page

‘ఒమేగా’లో క్యాన్సర్‌కు ఉచిత వైద్యం

Sep 21 2026 12:20 AM | Updated on Sep 21 2026 12:20 AM

తిరుపతి సిటీ : ఒమేగా హాస్పిటల్‌లో ప్రజలకు అధునాతన క్యాన్సర్‌ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆస్పత్రి చైర్మన్‌ డాక్టర్‌ చిగురుపాటి మోహన్‌ వంశీ తెలిపారు. ఆదివారం తిరుపతి రూరల్‌ మండలం గాంధీపురం సమీపంలోని వకుళమాత ఆలయం వద్ద ఉన్న ఒమేగా హాస్పిటల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌, ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌, వర్కింగ్‌ జర్నలిస్ట్‌ హెల్త్‌ స్కీమ్‌ కింద పూర్తి స్థాయి సమగ్ర క్యాన్సర్‌ వైద్య సేవలను ప్రారంభించినట్లు వెల్లడించారు. తిరుపతి, రాయలసీమ ప్రజలకు మెరుగైన క్యాన్సర్‌ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో రెండేళ్ల క్రితం తిరుపతిలో ఒమేగా హాస్పిటల్‌ ప్రారంభించామన్నారు. క్యాన్సర్‌కు ఎన్టీఆర్‌ వైద్య సేవ ద్వారా పూర్తి ఉచితంగా చికిత్స అందించనున్నట్లు చెప్పారు. చైన్నె, తిరుపతిలోఎక్కడా లేనివిధంగా అత్యాధునిక సదుపాయాలు, డిజిటల్‌ పెట్‌ సిటీ, ట్రూ బీమ్‌ రేడియేషన్‌ చికిత్స ఓమెగాలో ఉందని, నిపుణులైన సర్జికల్‌, మెడికల్‌, రేడియేషన్‌ అంకాలజిస్ట్‌లు అందుబాటులో ఉండడంతో వంద శాతం సక్సెస్‌ రేట్‌ను సాధించగలుగుతున్నామని వివరించారు. ఏపీజెన్‌కో, ట్రాన్స్‌కో, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఇండియన్‌ రైల్వేస్‌ ఉద్యోగులకి ఉచిత వైద్య సేవలు అందించడమే కాకుండా, ప్రధాన ఇన్సూరెన్స్‌ కంపెనీల ద్వారా చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రమేష్‌ రెడ్డి మాట్లాడుతూ క్యాన్సర్‌ను ప్రథమ దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని వెల్లడించారు. ఏ స్థాయిలో ఉన్న క్యాన్సర్‌నైనా గుర్తించగలిగే అధునాతన పరికరాలు ఒమేగా హాస్పిటల్‌లో అందుబాటులో ఉన్నాయని, వాటి ద్వారా క్యాన్సర్‌ను ప్రారంభంలోనే గుర్తించి చికిత్స అందిస్తామని వివరించారు. సమావేశంలో సర్జికల్‌ అంకాలజిస్ట్‌ డాక్టర్‌ శివనాథ్‌రెడ్డి, రేడియేషన్‌ అంకాలజిస్ట్‌ డాక్టర్‌ నవీన్‌ రెడ్డి, డాక్టర్‌ మురళీకృష్ణ, డాక్టర్‌ అలేఖ్య, డాక్టర్‌ వర్షిత, జీఎం నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement