కన్నుల పండువగా కాణిపాకం బ్రహ్మోత్సవాలు చిలుక, వృషభవాహనాలపై వరసిది ్ధ వినాయకుడి అభయం
కాణిపాకం: వరసిద్ధి వినాయకుడు శనివారం రాత్రి వృషభ వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. కాణిపాకంలో వరసిద్ధుని బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం మూలస్థానంలోని స్వామివారికి విశేష అభిషేక పూజ లు, అలంకరణలు చేశారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అలంకార మండపంలో శ్రీసిద్ధి, బుద్ధి సమే త వినాయకస్వామి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించారు. మంగళ హారతులతో చిలుక వాహనంపై కొలువుదీర్చారు. పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగునా పసుపు, పళ్లెం, కర్పూర హారతులు పట్టారు. రాత్రి వృషభ వాహనంపై స్వామివారు అభయమిచ్చా రు. అనంతరం రాత్రి అలంకార మండపంలో ఉభ య దేవేరుల సహిత వినాయకస్వామి ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, పరిమళభరిత పుష్పమాలికలు, విశేష ఆభరణాలతో అలంకరించి ఉభయదారులు, ఆలయ అధికారులు పల్లకిలో ఊరేగింపుగా తీసుకువచ్చి వృషభ వాహనంపై కొలువుదీర్చారు. ముందుగా ఈ వాహన సేవ ఉభయదారులు ఊరేగింపుగా వచ్చి పట్టువస్త్రాలు సమర్పించారు. తర్వాత ఉత్సవమూర్తిని వృషభ వాహనంపై పురవీధుల్లో ఊరేగిస్తూ భక్తులకు దర్శనప్రాప్తి కల్పించారు. ఈ క్రమంలో భక్తులు స్వామిని భక్తిప్రపత్తులతో స్మరిస్తూ, మోకరిల్లారు.
నేడు గజ వాహన సేవ
బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వయంభు శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆదివారం రాత్రి గజ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారని ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ఈ వాహనసేవకు కాణిపాకం వన్నియ నాయకర్ వంశస్తులు ఉభయదారులు వ్యవహరిస్తారని ఆయన పేర్కొన్నారు.


