సాక్షి, చిత్తూరు : తమిళనాడులోని రాణిపేట జిల్లా షోలింగర్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిత్తూరుకు చెందిన తండ్రి, కుమార్తె అక్కడికక్కడే దుర్మణం చెందారు. నగరంలోని కొంగారెడ్డిపల్లె గజానన్ పోలీస్ కాలనీలో నివసిస్తున్న సురేష్ (47), చిత్తూరు ఎస్టే ట్‌లో జేసీబీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అత డి కుమార్తె మధుమిత (20) చిత్తూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. తమిళనాడులోని షోలింగర్‌లో ఓ ఫంక్షనకు ద్విచక్రవాహనంపై ఇద్దరూ వెళ్లారు. తిరుగుప్రయాణంలో ఉండగా షోలింగర్– తిరుత్తణి రోడ్డులోని ద్రౌపదీ అమ్మన్ ఆలయం సమీపంలో తమిళనాడు ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సురేష్, మధుమిత అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఇద్దరి మృతదేహాలకు స్థానిక ప్రభుత్వాస్పపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. సాయంత్రం మృతదేహాలను చిత్తూరుకు తీసుకువచ్చారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, సురేష్‌కు భార్య, కుమారుడు ఉన్నారు.
విద్యుదాఘాతంతో
మెకానిక్ మృతి
పలమనేరు : మోటార్‌సైకిల్‌కు వాటర్ సర్వీస్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ మెకానిక్ మృతి చెందిన ఘటన పలమనేరులోని గడ్డూరు కాలనీలో శుక్రవారం జరిగింది. వినాయక (30) అనే యువకుడు మెకానిక్‌షాపు నిర్వహించేవాడు. ఓ బైక్‌కు వాటర్‌సర్వీస్ చేసేందుకు గన్ తీయగా ఉన్నట్టుండి నీటిలోకి కరెంట్ ప్రసరించడంతో షాక్‌కు గురై అక్కడిక్కడే మరణించాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వైభవంగా
మహాలక్ష్మియాగం
నారాయణవనం: మండలంలోని సిద్ధార్థ కళాశాలలో తొమ్మిది రోజుల పాటు నిర్వహించనున్న నవాహ్ని హోమ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం మహాలక్ష్మి యాగాన్ని ఘనంగా నిర్వహించారు. అలాగే సాయంత్రం లక్ష కుంకుమార్చన, ఆధ్యాత్మిక ప్రవచనాలు వైభవంగా జరిగాయి. ఉదయం 8.30 గంటలకు కళాశాల చైర్మన్ అశోక్‌రాజు దంపతుల ఆధ్వర్యంలో ఆగమ వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ మహాలక్ష్మి యాగం, లక్ష కుంకుమార్చన పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 4 నుంచి రెండు గంటల పాటు ‘యజ్ఞఫలం – లోకక్షేమం’ అంశంపై డాక్టర్ శేషచార్యులు ప్రవచించారు. అనంతరం మహాలక్ష్మి అమ్మవారి పల్లకీ సేవను నిర్వహించారు. అశోక్‌రాజు మాట్లాడుతూ మహాలక్ష్మి యాగంతో ప్రజలందరికీ ధార్మిక, ఆర్థిక, సాంస్కృతిక, జ్ఞాన, విజ్ఞాన, సిరిసంపదలు చేకూరుతాయన్నారు.
సురేష్, మధుమిత (ఫైల్)


