తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మూడో రోజు గురువారం రాత్రి మలయప్ప స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై శ్రీమన్నారాయణుడి అలంకరణలో తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఉదయం సింహ వాహనాన్ని అధిష్టించి యోగనరసింహుడి రూపంలో కనువిందు చేశారు. వాహన సేవల ముందు కళాబృందాల ప్రదర్శన ఆకట్టుకుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనాన్ని అధిరోహించి మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు. – తిరుమల
నిధి విలంబన!
ఆదర్శప్రాయుడు జగనన్న


