కాణిపాకంలో 90 శాతం యూపీఐ చెల్లింపులే ఆన్‌లైన్ పేమెంట్ల ద్వారా ప్రతినెలా రూ.3 కోట్లకు పైగా రాబడి భారం.. దేవస్థానం పైనా.. భక్తుల పైనా?
కాణిపాకం: యూపీఐ చెల్లింపులపై విధించే ఎండీఆర్ చార్జీలు కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంపై కూడా ఉండనుందనే వార్తలు వినిపిస్తున్నా యి. కేంద్ర ఆర్థిక శాఖ చెప్పినట్లు ఆ అదనపు ఛార్జీ దేవస్థానం పడుతుందా లేక భక్తుల పైనా అనే అంశంపై స్పష్టత రావడం లేదు. రూ.వెయ్యికి మించిన గదుల అద్దె వంటి వాటికి భక్తులు ఇప్పటికే 5 శాతం జీఎస్‌టీ చెల్లిస్తున్నారు. జీఎస్‌టీలో మినహాయింపు లేదు కాబ ట్టి యూపీఐ చెల్లింపులపై కూడా ఆలయం ఎండీఆర్ చెల్లించాల్సి ఉంటుందనే వివరాలు తెలుస్తున్నాయి. ప్రస్తుతం స్వామివారి వ్రతాలు, ప్రత్యేక పూజల టిక్కె ట్లు, ప్రసాదం, వసతి గదుల రిజర్వేషన్ నుంచి దర్శనం వరకూ ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు జరుగుతున్నాయి. సాధారణ రోజుల్లో రూ.10 లక్షల వరకూ ఉంటే, సంకటహర చతుర్ది, ఆదివారాలు, పర్వదినాల్లో రూ.12 లక్షల వరకూ ఉంటున్నాయి. ప్రతి నెలా రూ.2 కోట్ల వరకు ఆన్‌లైన్ పేమెంట్లు జరుగుతున్నాయి.
వీటిపై ఎండీఆర్ వడ్డన


