ప్రాసెసింగ్‌ యూనిట్‌ కార్యకలాపాల నిలిపివేత | - | Sakshi
Sakshi News home page

ప్రాసెసింగ్‌ యూనిట్‌ కార్యకలాపాల నిలిపివేత

Sep 18 2026 1:09 AM | Updated on Sep 18 2026 1:09 AM

● ఆరుగురికి తీవ్ర గాయాలు..! ● సంతపేటలో తీవ్రమైన కుక్కల బెడద ● సిద్ధార్థ కళాశాలలో ఆయుష్య హోమాలు, కోటి దీపోత్సవం

నగరి: మండలంలోని వీకేఆర్‌ పురం గ్రామంలోని పాల ఫ్యాక్టరీని గురువారం అధికారులు తనిఖీ చేశారు. కార్యకలాపాలను నిలిపివేశారు. ఈ ఫ్యాక్టరీ నుంచి వస్తున్న గాలిని పీల్చ డం వల్ల ముక్కులో మంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటోందని గ్రామస్తులు గతంలో నిరసన తెలిపారు. ఈ క్రమంలో అధికారులు స్పందించారు. ఆర్డీవో అనుపమ, తహసీల్దార్‌ రవికుమార్‌, ఎంపీడీవో వాణి గురువారం కష్వి మిల్క్‌ ప్రాడెక్ట్స్‌ డెయిరీ యూనిట్‌ను తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా యూనిట్‌లోని కార్యకలాపాలను పరిశీలించారు. అధికారుల నుంచి అనుమతులు పొందకుండానే చిల్లింగ్‌ యూనిట్‌ను ప్రాసెసింగ్‌ యూనిట్‌గా మార్చినట్లు గుర్తించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు చిల్లింగ్‌, ప్రాసెసింగ్‌ యూనిట్‌ కార్యకలాపాలను నిలిపివేయాల ని ఆదేశాలు జారీచేశారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో స్పష్టం చేశారు. అమలులో ఉన్న చట్టాలు, నిబంధనల ప్రకారం సంబంధిత వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కంపెనీ కార్యకలాపాలను నిలిపివేయాలంటూ గురువారం ఎంపీడీవో వాణి సంబందిత పాల ఫ్యాక్టరీ యాజమాన్యానికి నోటీసులు అందజేశారు.

చిత్తూరులో

వీధి కుక్కల వీరంగం

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): చిత్తూరు నగరం సంతపేట 45వ వార్డులో వీధి కుక్కలు విజృంభించాయి. గురువారం ఒక్కసారిగా ఆరుగురిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయంతో వణికిపోతున్నారు. స్థానికంగా ఉన్న ఓ కుటుంబం తమ ఇంటి ప్రాంగణాన్ని ఏకంగా డంపింగ్‌ యార్డుగా మార్చేయడంతో అక్కడికి భారీగా వీధి కుక్కలు చేరి తిష్ట వేశాయని అధికారులు చెబుతున్నారు. చెత్త దుర్వాసనకు తోడు కుక్కల సంచారం ఎక్కువై ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయో తెలియక ప్రజలు భయాందోళన చెందుతున్నారని స్థానికులతో పాటు అధికారులు వెల్లడించారు. పేరుకుపోయిన చెత్త కుప్పల్లోకి కుక్కలు దూరిపోవడంతో అధికారులు ఒక్క కుక్కను మాత్రమే పట్టుకున్నారు.

ఘనంగా ఆయుష్య హోమాలు, కోటి దీపోత్సవం

నారాయణవనం : స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాల ఆవరణలో తొమ్మిది రోజుల పాటు తలపెట్టిన నవాహ్నిక హోమ కార్యక్రమంలో భాగంగా గురువారం హోమాలు, ధార్మికోపన్యాసం, సాయంత్రం దీపోత్సవం, వేణుగోపాలస్వామి ఊరేగింపు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. చైర్మన్‌ అశోకరాజు ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోదీ పేరున ఉదయం ఆయుష్య హోమం, మృత్యుంజయ హోమం లక్ష తులసి అర్చనలను నిర్వహించారు. సాయంత్రం ప్రవచనకర్త కుప్పా విశ్వనాథ శా స్త్రిచే ‘ధర్మము – పునరవలోకనం‘ ప్రవసచనం కొనసాగింది. సాయంత్రం హోమ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ హాజరై శ్రీకృష్ణ వేణుగోపాలస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించి, గోపూజ నిర్వహించారు. దీపో త్సవం అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి (వేణుగోపాల అలంకారంలో) పల్లకీ ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవ్‌, అశోకరాజు మాట్లాడుతూ 25 ఏళ్ల సూదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా పనిచేస్తున్న నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం విశ్వగురు స్థానానికి చేరుకుంటుందన్నారు. ఆధ్యాత్మిక వేడుకల్లో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, భక్తులు పాల్గొని స్వామి వారి దివ్యాశీస్సులు అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement