సమస్యలకు సత్వర పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

సమస్యలకు సత్వర పరిష్కారం

Sep 18 2026 1:09 AM | Updated on Sep 18 2026 1:09 AM

కార్యాలయాల చుట్టూ తిప్పితే చర్యలు

అధికారుల హెచ్చరిక

74 మంది వెట్టిచాకిరీ బాధితులకు

7 రోజుల్లో పరిహారం

154 మంది ఎస్సీ, ఎస్టీ బాధితులకు రూ.1.16 కోట్ల పంపిణీ

అట్రాసిటీ కేసుల్లో నాణ్యమైన

దర్యాప్తుకు ప్రాధాన్యత

జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని ఎస్సీ, ఎస్టీల సమస్యలకు సత్వరం పరిష్కారం చూపాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు హెచ్చరించారు. కలెక్టరేట్‌లో గురువారం జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ (డీవీఎంసీ) సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణమే పరిష్కరించాలన్నారు. బాధితులను ఆఫీసుల చుట్టూ తిప్పించు కోవడం, చులకనగా, దురుసుగా మాట్లాడ టం వంటి ఘటనలు చోటుచేసుకుంటే సహించేది లేదన్నారు. ఎస్‌ఆర్‌.పురం మండలంలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఇంటి పట్టాలు మంజూ రు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించా రు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో శ్మశాన వాటికలు, రహదా రి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.

వెట్టిచాకిరీ బాధితులకు 7 రోజుల్లో పరిహారం

జిల్లాలోని బంగారుపాళ్యం ప్రాంతానికి చెందిన 74 మంది వెట్టిచాకిరీ (బాండెడ్‌ లేబర్‌) బాధితులకు మరో 7 రోజుల్లోపు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆర్డీవోను ఆదేశించారు. గుడిపాల మండలం 189 కొత్తపల్లిలో ఎస్సీ కాలనీ శ్మశాన భూమిని పరిశీలించి, 5 రోజుల్లో స్థలాన్ని కేటాయించాలని ఆర్డీవోకు సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు అట్రాసిటీ బాధితులైన 154 మంది ఎస్సీ, ఎస్టీ వ్యక్తులకు రూ.1.16 కోట్ల పరిహారాన్ని పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ప్రధాని ఆవాస్‌ యోజన పథకంలో అర్హులైన ఎస్సీ, ఎస్టీలకు గృహాలు, స్థలాలు మంజూరు చేయాలని హౌసింగ్‌, రెవెన్యూ శాఖల అధికారులను ఆదేశించారు.

30 శాతం తగ్గిన నేరాల నమోదు

ఎస్పీ తుషార్‌ డూడి మాట్లాడుతూ గతంతో పోలిస్తే జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై నేరాల నమోదు దాదాపు 30 శాతం తగ్గిందని తెలిపారు. అట్రాసిటీ, పరస్పర దాడు లు, దూషణల కేసుల్లో స్వతంత్ర సాక్షులు, శాసీ్త్రయ ఆధారాల లోపంతో కోర్టుల్లో నేరం నిరూపించడం క్లిష్టంగా మారుతోందన్నారు. తీవ్రమైన నేరాల్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు నుంచి ఛార్జ్‌షీట్‌ దాఖలు వరకు పక్కా ఆధారాలతో బాధితులకు న్యాయం జరిగేలా చేస్తున్నట్టు పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్వో మోహన్‌కుమార్‌, డీఎఫ్‌వో సుబ్బరాజు, ఎస్సీ వెల్ఫేర్‌ డీడీ రబ్బానిబాషా, డీవీఎంసీ సభ్యులు మునీంద్రనాయక్‌, వరలక్ష్మమ్మ, రవి, రాజ్‌కుమార్‌, శంకర్‌, మునస్వామి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement